చైనా ఫోన్ కొంటున్నారా.. జరభద్రం?
భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌ల తాకిడి రోజురోజుకు పెరిగిపోతోంది. తక్కువ ధరల్లో ఆకట్టుకునే హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఫోన్‌లను ఆఫర్ చేస్తూ వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. మార్కెట్లో హల్‌చల్ చేస్తోన్న చాలా వరకు చైనా బ్రాండ్‌లు అన్‌బ్రాండెడ్ లేదా తక్కవ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మనకు అంటగడుతున్నాయి.
Read More: 30 గాడిదలు... 1200 కండోమ్‌లు
మేడి పండు మాదిరిగా పైకి నిగనిగలాడుతూ కనిపించే ఈ ఫోన్‌లు నాసిరకమైన మెటీరియల్ డిజైనింగ్‌తో వాడుతున్న కొద్ది చుక్కలు చూపిస్తాయి. అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో తీసుకోవల్సిన 10 జాగ్రత్తలను క్రింది స్లైడ్‌షోలో ప్రస్తావించటం జరిగింది...

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
నెట్‌వర్క్ బ్యాండ్స్‌ను పరిశీలించండి
చాలా వరకు చైనా ఫోన్‌లు వాళ్ల రీజియన్‌లోని నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేయబడతాయి. ఉదాహరణకు TD-SCDMA నెట్‌వర్క్ ఈ 3జీ WCDMA స్టాండర్డ్ నెట్‌వర్క్ కేవలం చైనాలోనే పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎంపిక చేసుకోబోలే చైనా ఫోన్ మన స్థానిక్ నెట్‌వర్క్‌లను కూడా సపోర్ట్ చేసేవిగా ఉండాలి.

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
చైనా పవర్ ప్లగ్స్
కొన్ని సందర్భాల్లో చైనా ఫోన్‌లతో పాటు వచ్చే పవర్ సాకెట్స్ ఇక్కడ పని చేయవు. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
ఇయర్ ఫోన్‌లు ఇవ్వరు
తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు ఖర్చులను మరింతగా తగ్గించుకునే కమ్రంలో ఇయర్ ఫోన్‌లను ఇవ్వటం లేదు.

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్
తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు తమ ఫోన్‌లో ఇంటర్నల్ మెమరీ స్పేస్‌ను మరింతగా తగ్గించివేస్తున్నాయి. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే ఫోన్ 8జీబి అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండేలా చూసుకోండి.

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
కెమెరా
చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లు నాసిరకమైన కెమెరా క్వాలిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
స్ర్కీన్ ప్రొటెక్షన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తాము ఆఫర్ చేస్తోన్న ఫోన్‌ల పై రక్షణాత్మక కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లకు ఈ విధమైన సదుపాయం ఉండదు. ఇవి ఏ మాత్రం కిందపడినా ఎందుకు పనికిరాకుండా పోతాయి.

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
నాసికరమైన టచ్ రికగ్నిషన్
తక్కువ క్వాలిటీతో డిజైన్ కాబడే చైనా ఫోన్‌లలో టిచ్ రికగ్నిషన్ వ్యవస్థ నాసిరకంగా ఉంటుంది. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉండదు
చౌక ధరల్లో లభ్యమయ్యే అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లకు కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవు. ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండదు

అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లాంగ్వేజ్ సపోర్ట్
వాస్తవానికి అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లలో లాంగ్వేజ్ సపోర్ట్ కూడా నాసిరకంగానే ఉంటుంది. ఎందుకంటే అవి అక్కడ తయారవుతాయి కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో ఆండ్రాయిడ్ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది.

Click it and Unblock the Notifications