ఐ ఫోన్ 7:కొత్త ఫీచర్స్ వద్దంటూ యుద్ధం మొదలైంది
ఏందీ నమ్మలేకున్నారా..అవును నిజమండీ..ఐ ఫోన్ 7లో ఫీచర్స్ ఏమీ మార్చినా మాకొద్దని అభిమానులు మొత్తుకుంటున్నారు. మీరు తెచ్చే కొత్త ఫీచర్లతో మేము ఆ ఫోన్ కొనమని తెగేసి చెబుతున్నారు. ఈ మధ్య కొంత కాలంగా ఐ ఫోన్ 7 ఫీచర్స్ పై రూమర్స్ వస్తున్న విషయం విదితమే. అసలింతకీ అంతలా అభిమానులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో ఓ సారి చూద్దాం.
Read more: 10 వేలతో ట్విట్టర్ డేర్ చేస్తోందా..?

యాపిల్ తీసుకురానున్న ఐఫోన్ 7 సిరీస్లో
సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్ తీసుకురానున్న ఐఫోన్ 7 సిరీస్లో మార్పులను వినియోగదారులు స్వాగతించలేకపోతున్నారు. ఈ ఏడాది విడుదల చేయనున్న ఐఫోన్ లో ఉన్న ఫీచర్ల గురించి ఆన్‌లైన్ లో అంతులేకుండా రూమర్లు వస్తున్నాయి.

ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్ల కోసం ఉపయోగించే
ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్‌న్, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్ను పూర్తిగా ఎత్తివేసి వైర్లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్‌ఫోన్లకు కనెక్ట్ చేసుకునేందుకు వీలు కల్పించనుంది.

ఐఫోన్ 7 కు సంబంధించి యాపిల్ ఇప్పటివరకు
ఐఫోన్ 7 కు సంబంధించి యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే రానున్న ఐ ఫోన్ 7 ప్రతిపాదిత ఫీచర్లపై ఐఫోన్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. ఈ ఫీచర్లు వద్దని కోరుతూ యాపిల్ సంస్థకు లేఖ పంపేందుకు సిద్ధమవుతున్నారు.

దీనిపై 2 లక్షల మందిపైగా సంతకాలు
దీనిపై 2 లక్షల మందిపైగా సంతకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారు? వీరంతా ఐఫోన్ అభిమానులేనా? అనేది తెలియడం లేదు.ఇంతకీ ఐ ఫోన్ 7లో ఉన్న ఫీచర్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

ఇకముందు వైర్లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్ల అందుబాటులో
ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్ను, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్ను పూర్తిగా ఎత్తివేస్తోంది. అంటే, ఇకముందు వైర్లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్ల అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ చార్జింగ్ కు, ఇయర్, హెడ్‌ఫోన్లకు కనెక్ట్ కావడానికి ఇప్పటికే కొన్ని మోడల్స్ లో వున్న లైటనింగ్ కనెక్టర్ వ్యవస్థనే ఉపయోగిస్తారు.

ఈ లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా
ఈ లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్‌ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. 30 పిన్స్ ఉండే 3.5 జాక్‌ను ఉపయోగిస్తుండడం వల్ల ఐఫోన్ 6 ఎస్ సిరీస్‌ను 7.1 మిల్లీమీటర్లకన్నా తక్కువ మందానికి తయారు చేయలేకపోయారు.

ఇప్పుడు ఆ స్థానంలో 8 పిన్స్‌తో పనిచేసే
ఇప్పుడు ఆ స్థానంలో 8 పిన్స్‌తో పనిచేసే లైటనింగ్ కనెక్టర్‌ను తీసుకరావడం వల్ల ఫోన్ మందం కూడా 1 ఎంఎం తగ్గుతుంది. ఈ కొత్త సిరీస్‌లో ఉండే మరో ఆకర్షనీయమైన ఫీచర్ ఏమిటంటే ... .నాయిస్ కన్సీలింగ్ (అనవసర శబ్దాలను నియంత్రించే) టెక్నాలజీని ఉపయోగించాలనుకోవడం.

నాయిస్ కన్సీలింగ్ వ్యవస్థ ఫోన్ అంతర్భాగంలోనే
నాయిస్ కన్సీలింగ్ వ్యవస్థ ఫోన్ అంతర్భాగంలోనే ఉండడం వల్ల ఫోన్లోని స్పీకర్ల గుండా కూడా స్పష్టమైన వాయిస్ ను వినవచ్చు. లైటనింగ్ కనెక్టర్ ద్వారా కూడా ఇయర్ లేదా హెడ్ ఫోన్లలో మరింత స్పష్టంగా వాయిస్ వినిపిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రాబోయే ఈ ఐ ఫోన్ 7 ప్లస్ లో ఐ ఫోన్ 7 కన్నా
రాబోయే ఈ ఐ ఫోన్ 7 ప్లస్ లో ఐ ఫోన్ 7 కన్నా ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చనున్నారు. దీంతో బ్యాటరీ లైఫ్ మునుపటి కంటే 12. 5% పెరగనుంది. బ్యాటరీతో పాటు ఈ ఫోన్ మెమెరీ కెపాసిటీ కూడా బాగానే ఇంప్రూవ్ చేశారు. రాబోయే ఈ ఫోన్ లో 256 జీబీ మెమరీ సామర్ధ్యం ఉండబోతోంది.

మునుపటి మోడళ్ళలో ఉన్న బిగ్ స్క్రీన్, కెమెరా సామర్థ్యం
ఇందులో మునుపటి మోడళ్ళలో ఉన్న బిగ్ స్క్రీన్, కెమెరా సామర్థ్యం అలాగే ఉండనున్నాయి. ఇందులో ఉండబోయే బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ కావటం వల్ల మునుపటి కన్నా ఎక్కువ బ్యాక్ అప్ ఉండబోతోంది. దీంతో అనేక రకమైన యాపిల్ యాప్స్ ను వినియోగంలో ఉంచుకోవచ్చు.

రాబోయే 7 ప్లస్ లో ఉండబోయే త్రీడీ టచ్ స్క్రీన్ లో
రాబోయే 7 ప్లస్ లో ఉండబోయే త్రీడీ టచ్ స్క్రీన్ లో ఇంతకు మునుపున్న త్రీడీ టచ్ స్క్రీన్లలో లేని హోమ్ బటన్ ను మొదటిసారిగా ఇవ్వనున్నారు. ఈ మోడల్ ను యూజర్ సౌకర్యంగా చేతిలో పట్టుకునేందుకు వీలుగా తయారుచేస్తున్నట్లు, పైగా ఫోన్ చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ను అమర్చనున్నట్లు సంస్థ తెలిపింది.

పాత ఐఫోన్లకు కూడా ఉపయోగపడేలా
పాత ఐఫోన్లకు కూడా ఉపయోగపడేలా కొత్త ఐఫోన్లతోపాటు అడాప్టర్లను అందజేస్తారని సమాచారం. అయితే ఈ సరికొత్త ఫీచర్లు కలిగిన ఐఫోన్ 7 సిరీస్ ఎప్పుడు మార్కెట్లోకి వచ్చేది కంపెనీ వర్గాలు ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








