10 వేల‌తో ట్విట్టర్ డేర్ చేస్తోందా..?

Written By:

ట్విట్టర్ సరికొత్త సాహసానికి పూనుకుందా...140 అక్షరాల నుంచి ఏకంగా 10 వేల అక్షరాలకు ట్విట్టర్ ను పెంచే యోచన చేస్తుందా...అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత పదేళ్లుగా ట్విట్టర్ 140 అక్షరాలకు పరిమితమైన ట్విట్టర్ ఇప్పుడు ఇలా ఏకంగా 10 వేలకు ఒకేసారి పెంచడం వెనుక వ్యూహం ఏమై ఉంటుంది. ట్విట్టర్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఎందుకు రాలేదు. వాచ్ దిస్ ప్టోరి.

Read more: కొత్త రోగం: మొబైల్,ల్యాప్‌టాప్‌తో వాంతులే వాంతులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్వీటర్లో అక్షరాల (క్యారెక్టర్స్) పరిమితిని 140 నుంచి 10 వేలకు పెంచాలని

కొత్త ఏడాదిలో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్వీటర్ గురించి ఒక వార్త కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోంది. ట్వీటర్లో అక్షరాల (క్యారెక్టర్స్) పరిమితిని 140 నుంచి 10 వేలకు పెంచాలని యోచిస్తోందన్నది ఆ వార్త సారాంశం. దీనికి సంబంధించి ట్వీటర్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు.

పదేళ్లుగా 140 అక్షరాలకే పరిమితమైన ట్విట్టర్

అయితే .. పదేళ్లుగా 140 అక్షరాలకే పరిమితమైన ట్విట్టర్ ఇప్పుడు అక్షరాల పరిమితిని పెంచాలనే విప్లవాత్మక నిర్ణయం గురించి ఎందుకు ఆలోచిస్తోంది. ఇప్పుడు అందరి నుంచీ వస్తున్న ప్రశ్న ఇదే.

24 గంటలు వార్తలను అందించడం అత్యవసరం కావడంతో

ప్రస్తుతం మీడియా కల్చర్లో అనూహ్య మార్పులు వచ్చాయి. 24 గంటలు వార్తలను అందించడం అత్యవసరం కావడంతో వేగానికి ప్రాముఖ్యత పెరిగింది. ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలు, సమాచారాలు, వ్యాఖ్యలు, వాదనలు, ప్రతివాదనలు తక్షణం అందించడం అత్యావశ్యకమైంది.

అయితే ఫేస్బుక్, యూట్యూబ్, ట్వీటర్ వంటి వాటిలో

అయితే ఫేస్బుక్, యూట్యూబ్, ట్వీటర్ వంటి వాటిలో ఈ స్థాయి కమ్యూనికేషన్ టెక్నాలజీలను వినియోగించడం లేదు. పెట్టుబడిదారీ ప్రభావం కలిగిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు .. తమ డాటాను వీటికి అందజేయడం లేదు.

అయితే ట్విట్టర్ 140 అక్షరాల లిమిట్

అయితే ట్విట్టర్ 140 అక్షరాల లిమిట్ .. యూజర్లు తమ అభిప్రాయాలను లైక్స్, ట్విట్స్, రీట్విట్స్ ద్వారా క్లుప్తంగా చెప్పాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. దీని వల్ల వాద ప్రతివాదనలకు ఎక్కువ ఆస్కారం దక్కడం లేదు.

ట్వీటర్ ప్రకటనల వ్యాపారం అంత లాభదాయకంగా

ఇదే సమయంలో సహచర సైట్లతో పోలిస్తే .. ట్వీటర్ ప్రకటనల వ్యాపారం అంత లాభదాయకంగా లేదు. గత మూడేళ్లుగా నష్టాలబాటలోనే నడుస్తోంది. ఇదే సమయంలో ఫేస్‌బుక్ లాభాల్లో దూసుకుపోతోంది.

ట్వీటర్ వేగం, కచ్చితత్వం అడ్వర్టైజింగ్ కు అనుకూలం

అయితే ట్వీటర్ వేగం, కచ్చితత్వం అడ్వర్టైజింగ్ కు అనుకూలం. దీంతో సీఈవో జాక్ డోర్సే ట్విట్టర్ టెక్నాలజీ డిజైన్ను మారిస్తే సంస్థ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

దీంతో పది వేల అక్షరాలకు ట్విట్లను పెంచితే

దీంతో పది వేల అక్షరాలకు ట్విట్లను పెంచితే లాభాల బాట పట్టొచ్చని ట్వీటర్ భావిస్తోంది. 

అడ్వర్టైజ్‌మెంట్లు లేకుంటే సైట్ నడపడం కష్టమా

అయితే అడ్వర్టైజ్‌మెంట్లు లేకుంటే సైట్ నడపడం కష్టమా .. అంటే దానికి వీకీపీడియానే సమాధానం. ఇందులో ఎటువంటి ప్రకటనలు ఉండవు. అయినా ఇది మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్లలో ఒకటి. దీనికి విరాళాలు .. గ్రాంట్లు .. కొన్ని పెయిడ్ సర్వీసులు దీనికి నిధులు అందిస్తున్నాయి. ఇదే పద్ధతి ట్వీటర్కు ఎందుకు వర్తించదు ..? అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇప్పటికే 300 మిలియన్ల మంది ట్విట్టర్ను ఫాలో

అయితే ఏది ఏమైనప్పటికీ 10వేలకు పెంచడం ద్వారా నెటిజన్లు .. అధిక సంఖ్యలో వీడియోలు, ఫోటోలు పంపుకోవచ్చు. ఇప్పటికే 300 మిలియన్ల మంది ట్విట్టర్ను ఫాలో అవుతున్నారు. ప్రతి రోజు వేల మిలియన్ల మేసేజ్ లను ట్విట్టర్ ద్వారా పంపుకుంటున్నారు.

మూమెంట్స్ అనే ఫీచర్ ను, బై అనే బటన్ ను

ఈ సందర్భంగా ట్విట్టర్ అధికార ప్రతినిధి జిమ్ ప్రాసర్ .. ప్రస్తుతం టెస్టింగ్ లో ఉన్న వెర్షన్ లో క్యారెక్టర్ల పరిమితిని పెంచడమే కాకుండా మూమెంట్స్ అనే ఫీచర్ ను, బై అనే బటన్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలియజేశారు.

ట్విట్టర్ లో అందుబాటులో ఉన్న ఫేవరేట్ ఐకాన్ ను

అంతేకాకుండా ప్రస్తుతం ట్విట్టర్ లో అందుబాటులో ఉన్న ఫేవరేట్ (స్టార్ షేప్డ్) ఐకాన్ ను లైక్ (హార్ట్ షేప్డ్) ఐకాన్ గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ట్విట్టర్ సీఈవో జాక్ ట్వీట్ పరిమితిని 10 వేల క్యారెక్టర్లకు పెంచుతున్నట్లు నేరుగా చెప్పకుండా ఆయన తన ఖాతాలో 1325 క్యారెక్టర్ల ట్వీట్ ను పోస్ట్ చేయడం జరిగింది.

ట్వీట్ పరిమితిని 2015 లోనే పెంచాలని నిర్ణయించిన విషయం

కాగా, ట్వీట్ పరిమితిని 2015 లోనే పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు సాధ్యపడకపోవడంతో ఇప్పుడు తాజాగా 2016 న్యూ ఇయర్ కానుకగా తమ ఖాతాదారులకు 10 వేల క్యారెక్టర్ల అవకాశాన్ని కల్పిస్తామని ట్విట్టర్ ప్రకటించడం నిజంగా విశేషమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Twitter s Beyond 140 Up to 10 000 Characters in a Tweet
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot