ఈ ఏడాది మార్కెట్లో సత్తా చాటే ఫోన్లు ఇవే !

Written By:

2016 వెళ్లిపోయింది. 2017 కూడా వచ్చి నాలుగు రోజులు దాటిపోయింది. అయితే ఈ ఏడాది ఏ కంపెనీ ఫోన్లు వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఫోన్లు వస్తున్నాయని ప్రకటించాయి కూడా. అయితే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏవి. ఏ ఫోన్లు సంచలనాలు సృష్టించబోతున్నాయన్న దానిపై కొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాయి.

15 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల బ్యాటరీ లైఫ్

శాసంగ్ స్మార్ట్‌ఫోన్లు 2017

ఈ ఏడాది శాంసంగ్ దేనని చెప్పవచ్చు. శాంసంగ్ నుంచి ఈ ఏడాది గెలాక్సీ ఎస్ 8 అలాగే గెలాక్సీ నోట్ 8 ఫోన్లు రానున్నాయి. ఎస్ 8 ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోట్ 8 ఈ ఏడాది మధ్య భాగంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రానున్న ఈ ఫోన్లు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించనున్నాయి.

మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ఫోన్లు 2017

మైక్రోసాప్ట్ నుంచి సర్ఫేస్ ఫోన్ అతి త్వరలో దూసుకురానుందనే వార్తలు వస్తున్నాయి. రూమర్స్ ప్రకారం సర్ఫేస్ ఫోన్ అత్యాధునిక హంగులతో రానుందని తెలుస్తోంది.

నోకియా స్మార్ట్‌ఫోన్లు 2017

మైక్రోసాప్ట్ తో తెగదెంపులు చేసుకున్న నోకియా సరికొత్త మొబైల్స్ పై దృష్టి పెట్టింది. మిడ్ రేంజ్ బడ్జెట్ లో నోకియాను నుంచి సరికొత్త ఫోన్లు రానున్నాయని రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది నోకియా 4 స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్లు 2017

ఈ కంపెనీ నుంచి కూడా ఈ ఏడాది సరికొత్త ఫోన్లు రానున్నాయి. LG V30, LG G6 ఈ రెండు ఫోన్లు ఈ ఏడాది కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. LG G6 మొత్తం గ్లాస్ బాడితో రానున్నట్లు రూమర్లు తెలియజేస్తున్నాయి.

ఆపిల్ స్మార్ట్‌ఫోన్లు 2017

ఆపిల్ ఈ ఏడాది 3 ఫోన్లను లాంచ్ చేయబోతందని రూమర్లు వినిపిస్తున్నాయి. కంపెనీ 10 వార్షికోత్సవం ఈ ఏడాది ఉన్న నేపథ్యంలో ఆ రోజున ఈ ఫోన్లకు ముహర్తం పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 8 ఫీచర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పాటు ఐఫోన్ 7 , 7ప్లస్ కు కొత్త హంగులను జోడించి మళ్లీ మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 English summary
2017 Upcoming Smartphones Rumor Roundup: What's Expected From Samsung, Microsoft, Nokia, LG And More
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting