15 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల బ్యాటరీ లైఫ్

కె6 సీరీస్‌లతో ఇండియాలో సంచలనాలు సృష్టించిన లెనోవో ఇప్పుడు సరికొత్త ఫోన్‌తో ముందుకొస్తోంది.

By Hazarath
|

కె6 సీరీస్‌లతో ఇండియాలో సంచలనాలు సృష్టించిన లెనోవో ఇప్పుడు సరికొత్త ఫోన్‌తో ముందుకొస్తోంది. లెనోవో పీ2 పేరుతో రానున్న ఈ ఫోన్ లెనోవో వైబ్ పీ1కి పోటిగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కేవలం 15 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 10 గంటల బ్యాటరీ లైప్ ఇస్తుందని ట్రావెల్ సమయంలో ఛార్జింగ్ అయిపోతుందనే బెంగ అసలు అవసరమే లేదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

లీకో నుంచి 64జిబి ఫోన్, జియో సిమ్ ఫ్రీ హోమ్ డెలివరీ

అమోలెడ్ డిస్ప్లే

అమోలెడ్ డిస్ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో పాటు 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది. 2 గిగాహెడ్జ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ మీద ఫోన్ రన్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్

3/4 జీబీ ర్యామ్ తో పాటు 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో ఎస్ డీ ద్వారా 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయో ఫోటోలు దిగవచ్చు. సెల్ఫీ షూటర్ల కోసం 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

5100 ఎంఏహెచ్ బ్యాటరీ

5100 ఎంఏహెచ్ బ్యాటరీ

4 జీ వీవోఎల్టీఈ సపోర్ట్ తో పనిచేస్తుంది, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.1, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ ని మరింత బలోపేతం చేస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం.

దాదాపు రూ. 17, 800

దాదాపు రూ. 17, 800

గోల్డ్ , గ్రే వేరియంట్ లలో లభ్యమయ్యే ఈ ఫోన్ ఈ ఏడాది ఇండియా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర యూరోపియిన్ మార్కెట్ లో 261 డాలర్లు ఉంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 17, 800గా ఉంటే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Lenovo P2 is launching in India earlier this year read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X