ఎల్‌జీ జీ4 స్మార్ట్‌ఫోన్‌లోని 5 కీలక ఫీచర్లు

Posted By:

సామ్‌సంగ్, హెచ్‌టీసీ, సోనీ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 2015కు గాను తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటికే మార్కెట్లో విడుదల చేసేసాయి. ఇప్పుడు ఎల్‌జీ వంతు వచ్చింది. 2015కు గాను ఎల్‌జీ విడుదల చేయబోయే ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ‘ఎల్‌జీ జీ4' పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిజైనింగ్, స్పెసిఫికేషన్స్ వంటి అంశాలు ఈ ఫోన్‌ను మరింత అద్భుతంగా మలచినట్లు సమాచారం. ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జీ4'కు సంబంధించి 5 కీలక ఫీచర్లు ఇప్పుడు ప్రస్తావించుకుందాం...

ఇంకా చదవండి: డబ్బున్న పేదోళ్లు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెదర్ బ్యాక్ ఆప్షన్‌తో ఎల్‌జీ జీ4 స్మార్ట్‌‍ఫోన్ లభ్యమవుతుంది. దీంతో ఫోన్ మరింత హుందాగా చేతుల్లో ఒదిగిపోతుంది.

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2లో పొందుపరిచిన స్నాప్‌డ్రాగన్ 810 సాక్‌తో పోలిస్తే శక్తివంతమైన ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎల్‌జీ జీ4లో పొందుపరిచినట్లు సమాచారం. 3జీబి ర్యామ్!

క్యూహెచ్‌డి డిస్‌ప్లే‌తో కూడిన 5.5 అంగుళాల స్ర్కీన్ ఎల్‌జీ జీ4 స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఎల్‌జీ జీ4 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 16 మెగా పిక్సల్ రేర్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

రిమూవబుల్ బ్యాటరీ, మైక్రోఎస్డీ స్లాట్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Key Features Of LG's New Smartphone, The G4. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot