8జిబి ర్యామ్‌తో దూసుకొస్తున్న ఫోన్లు ఇవే !

Written By:

ఇప్పటిదాకా 6 జిబి ర్యామ్ ఫోన్లు మార్కెట్‌ని షేక్ చేశాయి. శాంసంగ్, హెచ్‌టీసీ, వన్ ప్లస్ లాంటి కంపెనీలు 6 జిబి కన్నా ఎక్కువ ర్యామ్ కలిగిన ఫోన్లను మార్కెట్ లోకి వదలాలని చూస్తున్నాయి. ఇప్పటికే అసుస్ ప్రపంచంలోనే తొలిసారిగా 8జిబి ర్యామ్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. 8 జిబి ర్యామ్‌తో వస్తున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Bsnl అన్‌లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ జెన్ ఫోన్ ఏఆర్

8 జిబి ర్యామ్ తో వస్తున్న అసుస్ జెన్ ఫోన్ ఏ ఆర్ ఫోన్ గూగుల్ టాంగో సపోర్ట్ తో పాటు డే డ్రీమ్ వీ ఆర్ ప్లాట్ ఫాంని సపోర్ట్ చేస్తుంది. అసుస్ ఈ ఫోన్ ని ఇండియాలో అతి త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానుంది. 23 ఎంపీ కెమెరా అలాగే 8 ఎంపీ సెల్పీ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రయిడ్ నౌగట్ మీద రన్ అవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ 8

మార్చి 29న జరగనున్న వరల్డ్ కాంగ్రెస్ 2017 ఈవెంట్ లో శాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. అంచనా ధర 849 డాలర్లు. మన కరెన్సీలో అయితే దాదాపు రూ.59,430 ఉండే అవకాశం ఉంది. ఐపీ68 సర్టిఫైడ్ తో పాటు వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ ఫ్రూప్ ని కలిగిఉంది. 30 నిమిషాలు నీటిలో నానినా ఈ ఫోన్ కి ఏంకాదని కంపెనీ చెబుతోంది. 12 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ , 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ లైయాన్ బ్యాటరీ.

హెచ్‌టీసీ 11

లేటెస్ట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానుంది. 8జిబి ర్యామ్ ప్రధాన ఆకర్షణ

ఒప్పో ఫైండ్ 9

బార్డర్ లెస్ డిస్ ప్లేతో ఈ ఫోన్ రానుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ అండ్ 8 జిబి ర్యామ్

వన్ ప్లస్ 5

వన్ ప్లస్ 3టీ 6 జిబి ర్యామ్ తో దూసుకొచ్చింది. ఇప్పుడు వన్ ప్లస్ 5ని 8 జిబి ర్యామ్ తో కంపెనీ తీసుకురావాలని చూస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Upcoming Smartphones With 8GB RAM: Samsung Galaxy S8, OnePlus 5, HTC 11 And More read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot