సామ్‌సంగ్‌‌తో సై అంటున్న హవాయి!

Posted By: Prashanth

సామ్‌సంగ్‌‌తో సై అంటున్న హవాయి!

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2కు పోటీగా ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు హవాయి (Huawei) సంస్థల ఉపాధ్యక్షుడు చింగ్ డాంగ్ తెలిపారు. ఈ డివైజ్‌కు ‘హవాయి ఆసెండ్ మేట్’(Huawei Ascend Mate)గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. 6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, హ్యాండ్‌సెట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

కీలక స్పెసిఫికేషన్‌లు:

6.1 అంగుళాల హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే,

1.8గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

13 మెగా పిక్సల్ కెమెరా,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

రికార్డుల పరంపరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లు:

పేటెంట్ హక్కులకు సంబంధించి ఆపిల్ నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ అమ్మకాల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. 2012కుగాను ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన అమ్మకాల గణంకాలను పరిశీలిస్తే.. మొదటి త్రైమాసపు అమ్మకాలు 42.2 మిలియన్ యూనిట్లు, రెండవ త్రైమాసపు అమ్మకాలు 52 మిలియన్ యూనిట్లు, మూడవ త్రైమాసపు అమ్మకాలు 55 మిలియన్ యూనిట్లు, నాలుగవ త్రైమాసికానికిగాను అమ్మకాల మొత్తాన్ని 61.5మిలియన్ లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన గెలాక్సీ ఎస్3 (స్మార్ట్‌ఫోన్) అలాగే గెలాక్సీ నోట్ 2 (ఫాబ్లెట్)లు సామ్‌సంగ్ అమ్మకాలను అమాంతం పెంచాయి. గెలాక్సీ ఎస్3 అమ్మకాలు విడుదలైన నాటి నుంచి 5 నెలల కాల వ్యవధిలో 30 మిలియన్ యూనిట్లను అధిగమించగా, గెలాక్సీ నోట్ 2, కేవలం 90 రోజుల వ్యవధిలోనే ఆ రికార్డును అధిగమించగలిగింది. ఈ గణంకాలను సామీహబ్ వెల్లడించింది.

గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మెరుగైన టచ్ అనుభూతులను చేరువచేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ ట్రేడస్ డివైజ్ ను రూ.36,700కు ఆఫర్ చేస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఇతర ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించి http://www.goprobo.com/లోకి లాగిన్ కాగలరు.

ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్’

యాపిల్ ఎఫెక్ట్: సామ్‌సంగ్ టాబ్లెట్ పై 6,000 తగ్గింపు!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot