ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?

Posted By:

అద్భుతమైన ఆలోచనలతో అందుబాటులోకి వస్తోన్న యాప్స్ (Apps), స్మార్ట్‌ఫోన్‌లను అసాధారణ పరికరాలుగా తీర్చిదిద్దునున్నాయి. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు అద్బుతాలు సాధించవచ్చన్న కుతూహలాన్ని యాప్స్ మనలో కలిగిస్తున్నాయి. ఈ యాప్స్ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌ను చిన్న సైజు కంప్యూటర్‌లా వాడుకుంటున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాప్స్ సహాయంతో ఆండ్రాయిడ్ ఫోన్‌లను అద్భుతాలుగా మార్చవచ్చన్న 6 సరికొత్త విషయాలను మీ ముందుంచుతున్నాం....

(ఇంకా చదవండి: మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న అమెజాన్ కైండిల్, కోబో‌ బుక్స్, గూగుల్ ప్లే బుక్స్, ఆల్డికో బుక్‌రీడర్ వంటి యాప్స్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇ-బుకర్ రీడర్‌లా మార్చేసుకోవచ్చు.

 

ఐపీ వెబ్‌క్యామ్ అనే అప్లికేషన్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వెబ్ క్యామ్‌లా మార్చుకుని కంప్యూటర్‌కు అనుసంధానించుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫిట్, రన్ కీపర్ - జీపీఎస్ ట్రాక్ రన్ వాక్, స్ట్రావా రన్నింగ్ అండ్ సైక్లింగ్ జీపీఎస్, ఇన్‌స్టెంట్ హార్ట్ రేట్ వంటి ఫీచర్ల సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిట్నెస్ ట్రాకర్‌లా మార్చుకోవచ్చు.

 

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ట్యూన్ ఇన్ రేడియో యాప్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రేడియోలా మార్చేసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న స్పాటిఫై మ్యూజిక్, ఆర్డియో మ్యూజిక్, స్మార్ట్ ఐఆర్ రిమోట్ - ఎనీ మోట్, వీఎల్‌సీ మొబైల్ రిమోట్ ఫర్ పీసీ & మ్యాక్, టీమ్ వ్యూవర్ ఫర్రి మోట్ కంట్రోల్, ఐఎఫ్ బై ఐఎఫ్ టీటీటీ వంటి యాప్స్ సహాయంతో డ రిమోట్ కంట్రోల్ లా వాడుకోవచ్చు.

 

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫర్ టాబ్లెట్, గూగుల్ డాక్స్, జోహో రైటర్, ఐఏ రైటర్, జోటర్ ప్యాడ్ (రైటర్) వంటి యాప్స్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వర్డ్ ప్యాడ్‌లా ఉపయోగించుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 alternative uses for Android: do almost anything with your phone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot