నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే 6 స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

స్మార్ట్‌ఫోన్‌లు మనందరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఒక్క మాటగా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ లేకుండా ఏ పని చేయలేకపోతున్నాం. స్మార్ట్‌ఫోన్ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు అనేక విప్లవాత్మక మార్పులను మనం ఫోన్‌లలో చూసాం. రోజులు గడుస్తున్న కొద్ది స్మార్ట్‌ఫోన్‌లు మరింత పెద్దివిగా, శక్తివంతంగా తయారవుతున్నాయి.

అప్పటి నుంచి ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌లలో అన్ని విభాగాలు అభివృద్థి చెందుతున్నప్పటికి బ్యాటరీ ఇష్యూ మాత్రం అలానే ఉంది. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్ సమస్యను అధిగమించే క్రమంలో మొబైల్ తయారీ కంపెనీలు క్విక్ చార్జింగ్ టెక్నాలజీ పై దృష్టి సారించటం మొదలు పెట్టాయి.

మోటరోలా కొత్త ఫోన్: 15 నిమిషాల్లొ 6 గంటల ఛార్జింగ్

ఈ నేపథ్యంలో మొదటి క్విక్ చార్జింగ్ 1.0 టెక్నాలజీని క్వాల్కమ్ సంస్థ 2012లో అందుబాటులోకి తీసుకువచ్చింది. కొంత కాలం తరువాత Snapdragon 800 సాక్‌తో పాటు 2.0 క్విక్ చార్జింగ్ టెక్నాలజీని క్వాల్కమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. క్వాల్కమ్ బాటలోనే ఒప్పో (Oppo) కూడా వేగవంతంగా చార్జ్ చేయగలిగే VOOC చార్జర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తరువాత మోటరోలా టర్బో చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది.

స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లను నిమిషాల్లో చార్జ్ చేయగలిగే క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 6 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే 6 స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సామ్‌సంగ్ ఇటీవల ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫాస్ట్ అడాప్టివ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ డివైస్‌ను కేవలం 1 గంట 18 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 7 గంటల 14 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే 6 స్మార్ట్‌ఫోన్‌లు

ఒప్పో సంస్థ ఇటీవల ఒప్పో ఫైండ్ 7ఏ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 28000 ఎమ్ఏహెచ్. VOOC చార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్‌ను 1 గంట 22 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 6 గంటల 6 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే 6 స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సామ్‌సంగ్ విడుదల చేసిన గెలాక్సీ నోట్ 4 ఫాస్ట్ అడాప్టివ్ చార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ డివైస్‌ను కేవలం 1 గంట 38 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 8 గంటల 43 నిమిషాల బ్యాకప్ ను ఇస్తుంది.

నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే 6 స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ పై పని చేస్తున్న గూగుల్ నెక్సుస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను 1 గంట 38 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 7 గంటల 53 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే 6 స్మార్ట్‌ఫోన్‌లు

క్విక్‌చార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న హెచ్‌టీసీ వన్‌ ఎమ్9 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని కేవలం 1 గంట 46 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 6 గంటల 25 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే 6 స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా ఇటీవల విడుదల చేసిన మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. టర్బో పవర్ బ్యాటరీ చార్జర్‌తో వస్తోన్నఈ ఫోన్‌ను 15 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 6 గంటలకు సరిపోయే చార్జింగ్ సమకూరుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Android Smartphones Launched with Quick Charging Feature. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot