మోటరోలా కొత్త ఫోన్: 15 నిమిషాల్లొ 6 గంటల ఛార్జింగ్

Written By:

ప్రముఖ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ల తయారీ కంపెనీ మోటరోలా, మోటీ జీ టర్బో ఎడిషన్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. మోటో జీ (3వ వర్షన్)కు సక్సెసర్ వేరియంట్ గా మోటరోలా ఇండియా ఈ టర్బో ఎడిషన్ వేరియంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ధర రూ.14,999. శక్తివంతమైన ఆక్టాకోర్ ప్రాసెసర్, బ్యాటరీని వేగవంతంగా చార్జ్ చేయగలిగే టర్బో పవర్ టెక్నాలజీ,ఐపీ67 రేటింగ్ తో కూడిన వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్ కోటింగ్ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలను మోటరోలా ఈ డివైస్ లో పొందుపరిచింది.

Read more: అతీత శక్తుల గుట్టు విప్పే టెక్నాలజీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విథంగా ఉన్నాయి...

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో కూడిన 5 అంగుళాల హైడెఫినిన్ డిస్ ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1280x720పిక్సల్స్, 294 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ సీపీయూతో కూడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాససెసర్.

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్

అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

(ప్రత్యేకతలు: క్విక్ క్యాప్చర్ సపోర్ట్, ఆటో ఫోకస్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, బరస్ట్ మోడ్, పానోరమా, హెచ్ డిఆర్, వీడియో ఐహెచ్ డీఆర్, టైమర్).

కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే

కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే 4జీ ఎల్టీఈ డ్యుయల్ మైక్రో సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ, గ్లోనాస్. మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్ ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీలో పొందుపరిచన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ 15 నిమిషాల వ్యవధిలో 6 గంటలకు సరిపోయే ఛార్జింగ్గ ను సమకూరుస్తుంది.
కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సమస్యే ఉండదు.

ధర ఇంకా కలర్ వేరియంట్స్

డిసెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్ ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది. ధర రూ.14,999. రెండు కలర్ వేరియంట్ లలో ఈ డివైస్ అందుబాటులో ఉంది.

వాటి వివరాలు

వాటి వివరాలు (బ్లాక్ విత్ డీప్ సీ బ్లు బ్యాక్, వైట్ విత్ స్లేట్ బ్యాక్). ఈ ఫోన్ కొనుగోలు 100 లక్కీ కస్టమర్ లకు 100 క్యాష్ బ్యాక్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై రూ.6,000 తగ్గింపును పొందటమే కాకుండా ఎయిర్ టెల్ డబల్ డేటా ప్యాక్ ను ఉచితంగా పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G Turbo Edition Launched in India Today Featuring Octa Core CPU and TurboPower at Rs.14,999. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot