Home
Mobile

6GB RAM, 256GB స్టోరేజ్, 50MP కెమెరాతో HTC కొత్త ఫోన్.. వైల్డ్‌ఫైర్ E7 పూర్తి ఫీచర్లు లీక్..

HTC Wildfire E7: HTC ఇంకా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వదిలిపెట్టలేదు. అప్పుడప్పుడూ సరసమైన ధరలలో మంచి ఫోన్లను తెస్తూనే ఉంది. తాజాగా రాబోతున్న ఫోన్, HTC వైల్డ్‌ఫైర్ E7, త్వరలో యూఏఈ (UAE)లో విడుదల కానుంది. అయితే, లాంచ్‌కు ముందే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు (స్పెసిఫికేషన్లు) ఇప్పుడే బయటకు వచ్చాయి. అసలు ఈ ఫోన్‌ను జనవరిలోనే గూగుల్ ప్లే కన్సోల్‌లో గుర్తించారు, అప్పుడే ఇది త్వరలో వస్తుందని సూచనలు అందాయి.

* డిస్‌ప్లే, పనితీరు

ఈ వైల్డ్‌ఫైర్ E7 లో 6.67-అంగుళాల (LCD) టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే అమర్చారు. దీని రిజల్యూషన్ 720x1600 పిక్సెల్స్ కాగా, 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం విశేషం. అలాగే, 420 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. పనితీరు విషయానికొస్తే, ఇందులో మీడియాటెక్ హీలియో G81 చిప్‌సెట్‌ను ఉపయోగించారు.

6GB RAM  256GB Storage and 50MP Camera  HTC Wildfire E7 Full Specs Leaked

Alcatel మళ్లీ భారత్‌కు వచ్చేస్తోంది.. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లతో మార్కెట్ షేక్!
దీనివల్ల రోజువారీ పనులకు, సాధారణ గేమింగ్‌కు ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది. 6GB RAM, భారీగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో, మెమరీ కార్డు కోసం ప్రత్యేక స్లాట్ కూడా ఇచ్చారు, కాబట్టి స్టోరేజ్‌ను ఇంకా పెంచుకోవచ్చు. తద్వారా ఎన్నంటే అన్ని ఫొటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు.

* కెమెరా, బ్యాటరీ

ఫొటోల కోసం, వెనుకవైపు 50 మెగాపిక్సెల్ (MP) ప్రధాన కెమెరా ఉంది. దానితో పాటు అలంకరణ కోసం అన్నట్లుగా 0.08MP సెన్సార్‌ను కూడా ఇచ్చారు. ఇది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ముందు వైపు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్‌లో 4,920mAh సామర్థ్యం గల బ్యాటరీని పొందుపరిచారు. ఇది 10W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువే కానీ దాన్ని ఛార్జ్ చేసుకోవడానికి యూజర్లకు ఎక్కువ సమయమే పడుతుంది. ఎందుకంటే కేవలం 10W ఛార్జింగ్ మాత్రమే సరిపోతుంది సాధారణ యూజర్లు ఇది రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే అవకాశం ఉంది.

Realme P3 vs Redmi Note 14.. రూ.20,000లోపు ఏ ఫోన్ కెమెరా తోపు?
* కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు

HTC వైల్డ్‌ఫైర్ E7 డ్యూయల్-సిమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0 ఉన్నాయి. నావిగేషన్ కోసం GPS/GLONASS సపోర్ట్ కూడా ఉంది. భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. వీటితో పాటు, ఒక స్పీకర్ (సింగిల్ స్పీకర్), ప్రస్తుతం చాలా ఫోన్లలో తీసేస్తున్న 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా ఇందులో ఉంచడం విశేషం.

* డిజైన్, లభ్యత

ఈ ఫోన్ బరువు 204 గ్రాములు. దీని కొలతలు 166.2 x 77.6 x 8.8 మిల్లీమీటర్లు. ఇది బ్లాక్ బ్లూ (Black Blue), లైట్ బ్లూ (Light Blue) అనే రెండు ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. బాక్సులో ఫోన్‌తో పాటు ఛార్జర్, యూఎస్‌బి కేబుల్ ఉంటాయి.

అలాగే ఫోన్ సేఫ్టీ కోసం ఒక టీపీయూ కేస్ (TPU case), సిమ్ ట్రే తీయడానికి సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఇస్తున్నారు. మొత్తం మీద చూస్తే, HTC బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో పోటీలో నిలబడేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ వైల్డ్‌ఫైర్ E7 కూడా అందుబాటు ధరలో మంచి ఫీచర్లను అందించే వారి మరో ప్రయత్నంగా కనిపిస్తోంది.

యూఏఈలో దీని అధికారిక లాంచ్ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు మరిన్ని అధికారిక వివరాలు, ధర వంటివి తెలిసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
HTC Wildfire E7 specs leak reveals a 6.67-inch display, Helio G81 processor, 50MP camera, and 4,920mAh battery. Launching soon in UAE with 6GB RAM and 256GB storage.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X