హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

Written By:

డిజైనింగ్, ఫీచర్స్ ఇంకా ధర విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధతీసుకుంటూ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోన్న చైనా ఫోన్‌ల కంపెనీ Huawei భారత్ మార్కెట్లో ప్రత్యేకమైన పాపులారీటిని సొంతం చేసుకుంది. ముఖ్యంగా హానర్ సిరీస్ నుంచి హవాయి విడుదల చేస్తున్న ఫోన్‌లకు యువత బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా తన మిడ్ రేంజ్ సెగ్మెంట్ నుంచి 'హానర్ 5ఎక్స్'(Honor 5X) పేరుతో సరికొత్త ఫోన్‌ను Huawei మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ధర రూ.12,999. హానర్ 4ఎక్స్ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లోకి వచ్చిన 5ఎక్స్ ఫోన్ ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

బ్రషుడ్ మెటల్‌తో తయారు కాబడిన హానర్ 5ఎక్స్ మొదటి చూపులోనే ప్రీమియమ్ లుక్ ఇంకా ఫీల్‌ను కలగజేస్తుంది. అద్భుతమైన టచ్ కంట్రోలింగ్, ఫోన్ కుడి వైపు సైడ్ భాగంలో ఏర్పాటు చేసిన వాల్యుమ్ కంట్రోలర్స్ ఆకట్టుకుంటాయి. కేవలం 158 గ్రాముల బరువుతో వస్తోన్న హానర్ 5ఎక్స్ తేలికగా అనిపిస్తుంది. చేతిలో సౌకర్యవంతంగా ఇమడగలిగే ఈ ఫోన్ ఓవర్ ఆల్‌గా కంఫర్టబుల్ ఫీల్‌ను కలిగిస్తుంది.

 

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

హానర్ 5ఎక్స్, 5.5 అంగుళాల అత్యుత్తమ ఎల్‌సీడీ ప్యానల్‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080 పిక్సల్స్. ముఖ్యంగా అవుట్ డోర్ వాతావరణంలో ఈ డిస్‌ప్లే ప్రకాశవంతమైన లుక్‌తో అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది.

 

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

హానర్ 5ఎక్స్ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. ఈ చిప్‌తో వచ్చే అ్రడినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. 2జీబి ర్యామ్ ప్రాసెసర్‌కు మరింత బలాన్ని ఇవ్వటంతో పాటు ఫోన్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది.

 

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫోన్‌ను సులువుగా అన్‌లాక్ చేయవచ్చు. ఈ స్కానర్ పలు గెస్ట్యర్ కంట్రోల్స్‌ను కూడా ప్రదర్శిస్తుంది.

స్కానర్ పైకి స్వైప్ చైయటం ద్వారా రీసెంట్ యాప్స్ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది.
స్కానర్ పై టాప్ చేయటం ద్వారా previous screenలోకి వెళ్లొచ్చు.
టాప్ చేసి హోల్ట్ చేయటం ద్వారా స్కానర్‌ను హోమ్ బటన్‌లా ఉపయోగించుకోవచ్చు.
స్కానర్ కిందికి స్వైప్ చైయటం ద్వారా నోటిఫికేషన్స్ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.

 

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

ఆండ్రాయిడ్ 5.1.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన EMUI 3.1 యూజర్ ఇంటర్‌ఫేస్ పై హానర్ 5ఎక్స్ ఫోన్ రన్ అవుతుంది. అనేక కస్టమైజేషన్ ఆప్షన్‌లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌కు త్వరలోనే Marshmallow అప్‌డేట్ అందనుంది.

 

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

హానర్ 5ఎక్స్ ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 అపెర్చుర్ వంటి ఫీచర్లతో ఈ కెమెరా ఆకట్టుకునే పనితీరును ప్రదర్శిస్తుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను ఆస్వాదించవచ్చు. ఫోన్ కెమెరా ద్వారా 1080 పిక్సల్ క్వాలిటీతో వీడియోలను షూట్ చేసుకోవచ్చు.

 

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

హానర్ 5ఎక్స్ ఫోన్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. డివైస్‌లో పొందుపరిచిన EMUI బ్యాటరీ సేవర్ ఆప్షన్ ద్వారా బ్యాటరీ లైఫ్‌ను మరింత ఆదా చేసుకోవచ్చు.

 

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

ఏ విధమైన సంశయం లేకుండా హానర్ 5ఎక్స్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మెటాలిక్ డిజైన్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న అత్యుత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లలో హానర్ 5ఎక్స్ ఒకటి. శక్తివంతమైన బ్యాటరీ లైఫ్, ఫీచర్ ప్యాకుడ్ ఆపరేటింగ్ సిస్టం, పెద్ద స్ర్కీన్ వంటి అంశాలు హానర్ 5ఎక్స్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Rock-Solid Reasons to Buy the Honor 5X!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot