ఏసర్ మొబైల్స్ ఇండియాకి వచ్చేస్తున్నాయ్.. ఈ ఫోన్లలో అదే స్పెషల్..?
Acer Smartphones Launching: ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఏసర్ (Acer). ఈ బ్రాండ్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. తైవాన్‌కు చెందిన ఏసర్, ఇండియన్ కంపెనీ అయిన ఇండ్కల్ టెక్నాలజీస్‌తో జత కట్టి, ఇండియాలో ఏసర్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతోంది. నిజానికి ఇది గతేడాది 2024లోనే జరగాల్సింది, కానీ ఇప్పుడు డేట్ ఫిక్స్ అయింది. అదే 2025, మార్చి 25.
అమెజాన్ ఇండియా ఆల్రెడీ ఈ లాంచ్ గురించి ఒక టీజర్ వీడియో రిలీజ్ చేసింది. దాంతో ఏసర్ ఏం సర్‌ప్రైజ్ ఇవ్వబోతుందోనని అందరూ వెయిట్ చేస్తున్నారు. అమెజాన్ టీజర్‌లో ఎన్ని ఫోన్లు లాంచ్ చేస్తారు, పేర్లు ఏంటి అనేది సీక్రెట్‌గా ఉంచారు. కానీ 2025 మొదట్లో ఏసర్ ఇండియా వెబ్‌సైట్‌లో మాత్రం రెండు ఫోన్లు మెరిశాయి.

* ఆ ఫోన్లు ఇవే
ఆ ఫోన్లు ఏసర్‌వన్ లిక్విడ్ S162E4, ఏసర్‌వన్ లిక్విడ్ S272E4. పేరు చూస్తేనే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లని అర్థమవుతోంది. వాటిల్లో మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్, HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయట. అయితే ఈ మోడల్స్‌నే లాంచ్ చేస్తారా, లేక ఇంకా పవర్‌ఫుల్ ఫోన్లు తీసుకొస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
* ఏసర్ ప్లాన్ ఏంటి..?
ఏసర్ మాత్రం ఇండియాలోని మిడ్-రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. అంటే అందరికీ అందుబాటులో ఉండే ఫోన్లతో పాటు, కాస్త ఎక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో ఫోన్లు కూడా వస్తాయన్నమాట. ధరలు మాత్రం రూ.15,000-రూ.50,000 మధ్యలో ఉంటాయని లీక్ అయింది. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదట.
టాప్ క్లాస్ హార్డ్‌వేర్, అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తామని ఏసర్ గట్టిగా చెబుతోంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, లాంచ్ ప్రమోషన్ ఇమేజ్‌లో ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో ఉన్నాడు. కింద "ది నెక్స్ట్ హారిజాన్" అని క్యాప్షన్ కూడా పెట్టారు. చూస్తుంటే ఏసర్ ఏదో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నట్టుంది.
* ఎక్కడ కొనాలి..?
ఏసర్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాక అమెజాన్ ఇండియాలో మాత్రమే దొరుకుతాయి. సో, అమెజాన్‌లో ఈ ఫోన్లు రిలీజ్ అయ్యాయో లేదో చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్, ధరలు లాంటి డీటెయిల్స్ త్వరలోనే వెల్లడి చేస్తారట. అయితే మార్కెట్లో మాత్రం గట్టి పోటీ ఉంది.
ఆల్రెడీ శామ్‌సంగ్, షియోమి, రియల్‌మీ లాంటి బ్రాండ్స్ ఊపుమీదున్నాయి. ఐఫోన్లు కూడా బడ్జెట్ ధరల్లో అందుబాటులోకి వస్తున్నాయి. బాగా పేరు మోసిన ఈ కంపెనీలకు గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు సైతం పోటీ ఇవ్వలేకపోతున్నాయి. మరి ఈ కఠినమైన స్మార్ట్ ఫోన్ల మార్కెట్ పోటీలో ఏసర్ ఎలా నిలబడుతుందో చూడాలి. ఏది ఏమైనా, ఏసర్ రీఎంట్రీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది.
ఏసర్ మంచి మొబైల్స్‌తో వస్తే, భారతీయులు ఆదరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వన్‌ప్లస్ ఫోన్లు ఒకప్పుడు ఎలా విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే. అయితే, ఆ కంపెనీ కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా తన మార్కెట్‌ను చేజేతులా కోల్పోయింది. ఏసర్ ఇప్పుడు విలువైన ఫీచర్లతో కూడిన మొబైల్స్‌ను అందిస్తే, ఈ పోటీలో నిలబడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








