ఉత్తరాఖండ్‌ బాధితులకు ఉచిత కమ్యూనికేషన్ సౌకర్యాలు: ఎయిర్‌సెల్

Posted By:

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌సెల్ ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్థం పలు సహాయక శిబిరాల వద్ద ఉచిత మొబైల్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ బూత్‌ల వద్ద నుంచి బాధితులు తమ ఇళ్లకు ఉచితంగా ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ బూత్‌లను ఎయిర్‌సెల్ టీమ్ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత బూత్‌లను అత్యధికంగా తెహ్రీ జిల్లాలోని కోటి రిలీఫ్ క్యాంప్ వద్ద ఏర్పాటు చేయటం జరిగింది.

బాధితులకు ఉచిత కమ్యూనికేషన్ సౌకర్యాలు: ఎయిర్‌సెల్

ఈ సహాయక క్యాంప్ వద్దకు కేదార్నాథ్, రుద్రప్రయాగ ఇంకా గౌరీకుండ్ ప్రాంతాల బాధితులు అధికంగా చేరుకుంటున్నారు. ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేసుకున్న ఎయిర్సెల్ సిబ్బంది బాధితులు మాట్లాడుకునేందుకు అవసరమైన సెల్‌ఫోన్ లతో పాటు టాక్‌టైమ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ బాధితుల కోసం ఎయిర్‌సెల్ రెండు హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. వాటి వివరాలు: + 91 9716215000 , + 91 9716218000.

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ‘పర్సన్ ఫైండర్' పేరుతో సరికొత్త అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేకమైన యాప్ వరద ముంపు ప్రాంతాల్లో అదృశ్యమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తెలియపరుస్తుందని గూగుల్ తన బ్లాక్ స్పాట్‌లో పేర్కొంది. గత వారం రోజులుగా ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వరదులు భీబత్సం సృష్టిస్తున్న విషయం తెలసిందే. ఈ విపత్తు పై వేగవంతంగా స్పందించిన గూగుల్ క్రైసిస్ బృందం పర్సన్ ఫైండర్ పేరుతో సరికొత్త టూల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot