ప్రపంచంలోనే అతి చిన్న టచ్‌స్క్రీన్‌ ఫోన్‌

Written By:

మీరు అనేక రకాలైన స్మార్ట్ ఫోన్లను చూసి ఉంటారు. అవి సైజు కూడా మినిమం 4అంగుళాల నుంచి పైనే ఉంటాయి. 7 అంగుళాల వరకు ఈ ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే అంతకన్నా తక్కువ స్మార్ట్ ఫోన్ వస్తే ఎలా ఉంటుంది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..అవును ఇప్పుడు ప్రపంచంచలోనే అత్యంత చిన్న స్మార్ట్‌ఫోన్ వచ్చింది..ఫీచర్స్ కూడా దుమ్మురేపే విధంగా ఉన్నాయి.

దీపావళి బొనాంజా...బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే సైజు

మీరు చూస్తున్నఈ ఫోన్ డిస్‌ప్లే సైజు కేవలం 1.54 ఇంచులు మాత్రమే! అందుకే కాబోలు ప్రపంచంలోనే అతి చిన్న టచ్‌స్క్రీన్‌ ఫోన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.

పెద్ద స్మార్ట్‌ఫోన్లకు ఏ మాత్రం తీసుపోదు.

ఈ చిట్టి ఫోన్‌ పేరు ‘వీఫోన్‌ ఎస్‌8'. చైనాలోని ‘వీఫోన్‌' అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. అయితే పరిమాణంలో ఇది పొట్టిదైనా.. ఫీచర్ల విషయంలో మాత్రం పెద్ద స్మార్ట్‌ఫోన్లకు ఏ మాత్రం తీసుపోదు.

ఐఓఎస్‌.. ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో

ఐఓఎస్‌.. ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇతర ఓఎస్‌లను సపోర్ట్‌ చేసే ఫోన్లనూ తీసుకురానున్నట్లు సంస్థ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పవర్‌ బటన్‌

ఫీచర్ల విషయానికొస్తే దీనికి పవర్‌ బటన్‌ మాత్రమే ఉంది. దీంతో పాటు తెరపై మరో మూడు వర్చువల్‌ బటన్స్‌ ఉన్నాయి. మిగతా ఫోన్లలాగే స్పీకర్‌, మైక్రోఫోన్‌ కలిగి ఉంది.

హార్ట్‌ రేట్‌ సెన్సర్‌

బిల్ట్‌ఇన్‌ ఎఫ్‌ఎం రేడియో ఉంటుంది. అలాగే హార్ట్ రేట్ చూసేందుకు హార్ట్‌ రేట్‌ సెన్సర్‌ కూడా ఉంటుంది. ఇంకా అద్భుతమైన ఫీచర్ నడకను లెక్కించే పెడోమీటర్‌ కూడా ఇందులో ఉంటుంది.

64ఎంబీ ర్యామ్‌

64ఎంబీ ర్యామ్‌ 128ఎంబీ ఇంటర్నల్‌ మెమొరీ(8జీబీ వరకు పెంచుకోవచ్చు) దీంతో పాటు 8జిబి టీ ఫ్లాష్ మెమొరీ ఉంటుంది. అయితే ఇది ఒక సిమ్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

30 గ్రాములు

బ్యాటరీ విషయానికొస్తే 380యంఏహెచ్‌ బ్యాటరీ. ఫోన్ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే. ఈ ఫోన్ లో యూజర్స్ మెసేజ్ లు సోషల్ మీడియా యాప్స్ లాంటివన్నీ చూసుకోవచ్చు.

ఫోన్‌ ధర 30 డాలర్లు

ఈ ఫోన్‌ ధర 30 డాలర్లు(సుమారు రూ. 2000). ఇది ప్రస్తుతానికి చైనా మార్కెట్‌లోనే అందుబాటులో ఉంది. Bluetooth v4.0, 5 PIN USB, USB 2.0 ,హెడ్‌ఫోన్‌ జాక్‌ ,లైట్‌ సెన్సర్‌ అదనపు ఫీచర్లు

కొనాలనుకుంటే చైనాకు

ఇండియాకు ఎప్పుడు వస్తుందనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. మీరు దీన్ని కొనాలనుకుంటే చైనాకు పోవాల్సిందే. లేకుంటే ఇండియాకు వచ్చే వరకు ఆగాల్సిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
All About Vphone S8- World’s Smallest Touch Screen Phone read more at telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting