365 రోజులు నీటిలో నానినా చెక్కు చెదరలేదు

Written By:

ఐఫోన్..ఈ ఫోనంటే చాలామంది చెప్పలేని క్రేజ్..అయితే ఈ ఫోన్లు చేతులో నుంచి జారి కిందపడితే ప్రాణం విలవిలలాడిపోతుంది కదా..అదే నీళ్లలో పడితే ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఐఫోన్ సంవత్సరం నుంచి నీళ్లలో నానినా ఎటువంటి డ్యామేజి కాకుండా చక్కగా పనిచేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా..అయితే న్యూస్ చూస్తే మీరే షాక్ అవుతారు.

ఏపీ ప్రజలకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్స్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏడాదిపాటు నదిలో మునిగిన ఐఫోన్

ఏడాదిపాటు నదిలో మునిగిన ఐఫోన్ చెక్కుచెదరలేదు. చక్కగా పనిచేస్తోంది. మాములుగా ఖరీదైన ఫోన్లు కిందపడితేనే హ్యాంగ్ అవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఐఫోన్ మాత్రం 365 రోజులు నీళ్లలో ఉండి కేకపుట్టించింది.

ఐస్ ఫిషింగ్ చేస్తుండగా

వివరాల్లోకెళితే .. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన మైఖెల్ ఏడాది క్రితం ఓ నదిలో ఐస్ ఫిషింగ్ చేస్తుండగా పొరపాటున తన వద్ద ఉన్న ఐఫోన్ -4 జారి నీళ్లలో పడిపోయింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనూహ్యంగా ఏడాది తర్వాత

ఎంత వెతికినా అది దొరకకపోవడంతో మైఖెల్ తన ఫోనుపై ఆశలు వదులుకున్నాడు. అయితే అది అనూహ్యంగా ఏడాది తర్వాత డేనియల్ కాల్గ్రామ్ అనే మెకానికల్ ఇంజినీర్ కి ఆ ఫోన్ దొరికింది.

నీటి అడుగున బురదలో ఇరుక్కుపోయిన

ట్రెజర్ హంటింగ్ అంటే ఇష్టపడే డేనియల్ మైఖెల్ ఫోన్ పోగొట్టుకున్న నదిలో ట్రెజర్ హంటింగ్ చేస్తుండగా నీటి అడుగున బురదలో ఇరుక్కుపోయిన ఐ ఫోను డేనియల్ వద్ద ఉన్న మెటల్ డిటెక్టర్ కి దొరికింది.

రెండు రోజుల పాటు చార్జింగ్

డేనియల్ దాన్ని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి బియ్యం సంచిలో పెట్టాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు చార్జింగ్ పెట్టడంతో ఫోన్ చక్కగా పనిచేసింది.

ఫోన్ నెంబర్ల ఆధారంగా

ఆ తర్వాత అందులో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా డేనియల్ మైఖెల్ ఆచూకీ తెలుసుకొని జరిగిన విషయం చెప్పడంతో తాను పోగొట్టుకున్న ఫోన్ ఏడాది తర్వాత దొరికిందని మైఖెల్ ఇప్పుడు సంబరపడిపోతున్నాడు.

ఫోన్ కి రబ్బర్ కేసు ఉండడంతో

మామూలుగా అయితే ఐఫోన్ 365 రోజుల పాటు నీటిలో అదీ బురదలో ఇరుక్కుపోతే పనిచేయడం అసాధ్యం. కానీ మైఖెల్ వాడిన ఫోన్ కి రబ్బర్ కేసు ఉండడంతో అది రిపేర్ చేస్తే చక్కగా పనిచేస్తోంది ఇప్పుడు.

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
An Apple iPhone 4 spends a year trapped in an icy lake, and still works fine read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot