ఏపీ ప్రజలకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్స్ !

Written By:

నవ్యాంధ్ర ప్రజలు డిజిటల్ యుగం వైపు అడుగులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలంతా కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఏపీ ప్రజలకు క్యాష్ లెస్ ట్రాన్సిక్షన్స్ కోసం ఉచితంగా మొబైల్స్ ను అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఇకపై నో మనీ ఓన్లీ కార్డు..ఏపీ బస్సుల్లో కార్డు స్వైపింగ్ ఆప్షన్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏపీ ప్రజలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్

నోట్ల రద్దు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ అందించేందుక కసరత్తు చేస్తోంది. ఏపీలో ఇప్పటికే చాలా గ్రామాలు వెనుకబడి ఉన్నాయి. వారిక మొబైల్ సౌకర్యం అందుబాటులో లేదు. అలాంటి వారందరికీ ప్రభుత్వం ఉచితంగా మొబల్స్ ను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.

మొత్తం ఆన్ లైన్ ద్వారానే లావాదేవీలు

అదీగాకుండా నోట్ల రద్దుతో బ్యాంకుల్లో ఏటీఏంల్లో డబ్బులు అయిపోయిన నేపథ్యంలో మొత్తం ఆన్ లైన్ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇలా మొబైల్స్ ను ఇవ్వనున్నట్లు సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అధికారులతో చర్చలు

ఈ పక్రియకు సంబంధించిన వివరాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ బిఐ అధికారులతో అలాగే బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇబ్బందులు ఏముంటాయని ఆరా తీసున్నారు.

రూ. 30000 కోట్ల కొత్త నోట్లు

ఏపీలో నోట్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ. 30000 కోట్ల కొత్త నోట్లు ఈ నెల 28వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్ కి పంపిచనున్నట్లు ఆర్ బిఐ చంద్రబాబుకు తెలిపినట్లు సమాచారం.

దాదాపు రూ. 60 కోట్లు

ఇందులో దాదాపు రూ. 60 కోట్లు చిన్న నోట్లు ఉంటాయని ఆర్ బిఐ అధికారులు చెబుతున్నారు.

ఆర్బిఐ రిప్రజెంటివ్ హరిశంకర్ తో

ఈ సమావేశానికి ఆర్బిఐ రిప్రజెంటివ్ హరిశంకర్ తో పాటు ఆంధ్రా బ్యాంకు డిప్యూటి జనరల్ మేనేజర్ జిఎస్వి కృష్ణారావు ఇతర సీనియర్ అధికారులు హాజరు అయ్యారు. సమస్యల గురించి చర్చలు జరిపారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Andhra Pradesh government to distribute free mobile phones to aid cashless transactions Read more At gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting