మరో సామ్‌సంగ్ ఫోన్‌కు Nougat అప్‌డేట్
అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో మీ ఫోన్‌లో కనీసం 2జీబి స్టోరేజ్ స్పేస్ ఖాళీగా ఉండాలి. ఇదే సమయంలో ఛార్జింగ్ శాతం 50 పాయింట్ల వరకు ఉండాలి.
సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి కొద్ది నెలల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ Galaxy On Nxt (64జీబి వేరియంట్) లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది. ఈ అప్‌డేట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఫిర్మ్‌వేర్ వర్షన్ G610FXXU1BQH8 నెంబర్‌తో ఉంటుంది. ఫైల్ సైజ్ 1139.63MB.
Read More : మీ ల్యాప్‌టాప్ సెక్యూరిటీ కోసం ముఖ్యమైన టిప్స్

అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో మీ ఫోన్‌లో 2జీబి స్టోరేజ్ స్పేస్ ఖాళీగా ఉండాలి. ఇదే సమయంలో ఛార్జింగ్ శాతం 50 పాయింట్ల వరకు ఉండాలి. over-the-air (OTA) ద్వారా లభించే ఈ అప్‌డేట్‌ను ఫోన్ Settings ->About Phone -> Software Updateలోకి వెళ్లి మాన్యువల్‌గా చెక్ చేసుకోవచ్చు.

Galaxy On Nxt స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్ర్కీన్, ఫుల్ మెటల్ యునిబాడీ డిజైన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్ట్జ్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లుటూత్ 4.1, జీపీఎస్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ), 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications