ఆపిల్ కళ్లుచెదిరే ఆఫర్..ఐఫోన్లపై రూ.23 వేల క్యాష్‌బ్యాక్

Written By:

ఆపిల్ ఇప్పుడు బంఫరాఫర్ ఇచ్చింది. ఆపిల్ ఉత్పత్తులపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది. సిటీ బ్యాంకుతో జతకట్టిన ఆపిల్ స్పెషల్ కాంబో ఆఫర్ పేరుతో కష్టమర్లకు పండగ వాతావరణాన్ని కల్పించనుంది. ఐఫోన్7, 7ప్లస్, ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ 2 ఇలా అన్ని రకాల ఉత్పత్తులపై కళ్లు చెదిరే క్యాష్‌బ్యాక్ ను ఇవ్వనుంది. ఇది మీ అకౌంట్లో 90 రోజుల్లో క్రెడిట్ కానుందని కంపెనీ తెలిపింది.

ట్రంప్ దెబ్బ.. చైనాకి షాకిస్తున్న ఆపిల్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్పెషల్ కోంబో ఆఫర్‌

ఆపిల్, సిటీ బ్యాంకు రెండు జతకట్టి ఓ స్పెషల్ కోంబో ఆఫర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చాయి. ఈ ఆఫర్ ప్రకారం ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ .23 వేల వరకు క్యాష్ బ్యాక్‌ను అందిచనున్నట్టు ఆపిల్ తెలిపింది.

కొత్త ఫోన్లతో పాటు ఐప్యాడ్

అయితే ఈ కొత్త ఫోన్లతో పాటు ఐప్యాడ్ కూడా కొనుగోలుచేసిన వారికే ఈ కోంబో ఆఫర్ వర్తించనుంది. అదేవిధంగా ఐప్యాడ్ కొనుగోలు చేసిన వారికీ ఈ క్యాష్ బ్యాక్ వర్తించనుంది.

రెండింటిని ఒకేసారి, ఒకేస్టోర్‌లో

కానీ వారు కూడా ఆపిల్ లేటెస్ట్‌గా విడుదల చేసిన ఐఫోన్ మోడల్స్ ఫోన్లలో ఏదో ఒకదానికి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని ఒకేసారి, ఒకేస్టోర్‌లో కొనుగోలు చేయాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు మాత్రమే

ఈ ఆఫర్ కేవలం సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు మాత్రమే వర్తించనుంది. ఒకవేళ అవసరమైతే వీటిని కొనుగోలు చేసేటప్పుడు ఇచ్చే ఫోన్ నెంబర్ కూడా రెండింటిలోనూ ఒకేలా ఉండాలి.

ఎంపికచేసిన ఆఫ్‌లైన్ ఆపిల్-ఆథరైజడ్ రీసెల్లర్స్

ఐఫోన్-ఐప్యాడ్ కోంబో ఆఫర్ కేవలం ఎంపికచేసిన ఆఫ్‌లైన్ ఆపిల్-ఆథరైజడ్ రీసెల్లర్స్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ శుక్రవారం నుంచి ప్రారంభమై, 2016 డిసెంబర్ 31 కి ముగియనుంది.

నాలుగు లావాదేవీలు మాత్రమే

ఆఫర్ కాలంలో కస్టమర్లు గరిష్టంగా నాలుగు లావాదేవీలు మాత్రమే జరపాల్సి ఉంటుంది. ప్రతి నెలా రెండు లావాదేవీలకు కంపెనీ అనుమతించనున్నట్టు తెలిపింది.

రూ .17 వేల వరకు క్యాష్‌బ్యాక్

ఐఫోన్ 7 లేదా ఐఫోన్ 7 ప్లస్ కొనుగోలు చేసే కస్టమర్లు ఐప్యాడ్ మినీ 2, ఐప్యాడ్ మినీ 4 ను కొనుగోలు చేస్తే, రూ .17 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందనున్నారు.

రూ .23 వేల వరకు క్యాష్‌బ్యాక్‌

ఒకవేళ ఐప్యాడ్ ఎయిర్ 2 కొంటే, రూ .18 వేలు, ఐప్యాడ్ ప్రొ మోడల్ కు రూ .23 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

90 రోజుల్లో

ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాలు మీరు కొనుగోలు చేసిన తర్వాత 90 రోజుల్లో సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులో క్రెడిట్ కానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple, Citibank Team Up to Offer Up to Rs. 23,000 Cashback on iPhone, iPad Combo Purchase Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot