ట్రంప్ దెబ్బ.. చైనాకి షాకిస్తున్న ఆపిల్ !

Written By:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకి ఆపిల్ కంపెనీ చైనాకు షాకివ్వబోతోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటిదాకా ఐఫోన్లను చైనాలో తయారుచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై ఆపిల్ తన ఫోన్లను అమెరికాలోనే తయారుచేయాలని ట్రంప్ సూచించినట్లు సమాచారం. ఆపిల్ కూడా ఈ దిశగా తన చర్యలను ప్రారంభించిదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఎయిర్‌టెల్ బ్యాంకు వస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ మేడిన్ అమెరికా

ఆపిల్ కంపెనీ ఐఫోన్లను భవిష్యత్‌లో అమెరికాలోనే తయారుచేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఐఫోన్ మేడిన్ అమెరికాగా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ ఆలోచనతో ఆపిల్ సంస్థ సైతం

ట్రంప్ ఆలోచనతో ఆపిల్ సంస్థ సైతం ఈ దిశగా ఆలోచిస్తోందని సమాచారం. ఆపిల్ సంస్థ ఐఫోన్కు విడిభాగాలనందించి వాటిని అసెంబుల్ చేసే ఫాక్స్‌కాన్, పెగట్రాన్ సంస్థలను అమెరికాలోనే మొబైల్ తయారు చేసేలా చూడాలని కోరినట్లు సమాచారం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫాక్స్‌కాన్ పరిశీలిస్తామని చెప్పగా

అయితే దీనిపై ఫాక్స్‌కాన్ పరిశీలిస్తామని చెప్పగా, పెగట్రాన్ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీని వల్ల తమకు ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఫాక్స్‌కాన్ ఛైర్మన్ టెరీ గోయ్

వాస్తవానికి తమకు అతిపెద్ద కస్టమర్ అయిన ఆపిల్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ టెరీ గోయ్ కూడా ఈ అంశంపై అంత ఆసక్తిగా లేరు.

పలు అమెరికా కంపెనీలు తమ ఉత్పత్తులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు అమెరికా కంపెనీలు తమ ఉత్పత్తులు అమెరికాలోనే తయారు చేయాలని భావిస్తున్నారు. తద్వారా దేశ ఆర్థిక రంగానికి వూపొస్తుందన్నది ఆయన అభిలాష. తన ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.

200 మిలియన్ ఐఫోన్లు

సంవత్సరానికి 200 మిలియన్ ఐఫోన్లు తయారుచేసే ఈ సంస్థకు అమెరికాలోనే ఫోన్ తయారు చేయడం వల్ల ఖర్చు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
iPhones may soon be made in America read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting