ఇండియాకి ఆపిల్ షాక్:ఆ మోడల్ ఐఫోన్ల అమ్మకాలు బంద్

By Hazarath
|

మీరు ఐ ఫోన్ అభిమానులా..అయితే ఐ ఫోన్ పాత ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి..ఐఫోన్ 7 వచ్చిన తరువాత ఆపిల్ కొన్ని ఐఫోన్లను బంద్ చేయాలని నిర్ఫయం తీసుకుంది. ఐ ఫోన్ 7 అమ్మకాలు ఎలాగైనా పెంచాలని ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇలా కొన్ని అమ్మకాలను ఆపేసిన విషయం విదితమే. ఆపిల్ బంద్ చేసిన మోడళ్లేంటో ఓ సారి చూడండి.

ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

#1

#1

ఆపిల్ నుంచి దూసుకొచ్చిన ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ ల అమ్మకాలను ఆపిల్ భారత్ లో నిలిపివేసింది.

#2

#2

ప్రస్తుతానికి ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐ ఫోన్ ఎస్ఈ మోడళ్లు మాత్రమే ఆపిల్ వెబ్‌సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

#3

#3

ఐ ఫోన్ 7 విడుదల అనంతరం ఐ ఫోన్ 5ఎస్ ను నిలిపివేస్తారనే ఊహాగానాలు ముందే వచ్చినా.. ఐ ఫోన్ 6ను కూడా ఆపిల్ నిలిపివేయడం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

#4
 

#4

స్టోరేజి కెపాసిటీ విషయంలో ఆపిల్ పలుమార్పులు చేయడంతో ఇక మీదట ఐ ఫోన్ 6ఎస్, ఐ ఫోన్ 6ఎస్ ప్లస్ లు 32జీబీ, 128జీబీ వేరియంట్లలో మాత్రమే లభించనున్నాయి.

#5

#5

ప్రస్తుతం కొన్ని ఈ-కామర్స్ స్టోర్లలో మాత్రమే పాత ఐ ఫోన్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

#6

#6

కాగా, అక్టోబర్ 7 నుంచి ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్ లు భారత్ లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తాయి. 60 వేల ధరతో అక్టోబర్ నుంచి ఈ ఫోన్లు ఇండియా మార్కెట్లో లభిస్తాయని తెలిపింది.

 

 

Best Mobiles in India

English summary
Apple discontinues iPhone 5s, 6 and 6 Plus after iPhone 7 launch in India read more gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X