ఇండియాలో డెడ్ దిశగా ఆపిల్ ఐఫోన్లు, ట్రాయ్ కఠిన చర్యలు !

ఇండియాలో ఆపిల్ ఐఫోన్ చరిత్రపుటల్లోకి వెళ్ళనున్నాయా, డెడ్ దిశగా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాయా అంటే ట్రాయ్ కఠిన నిర్ణయాలు నిజమనే సంకేతాలను అందిస్తున్నాయి.

|

ఇండియాలో ఆపిల్ ఐఫోన్ చరిత్రపుటల్లోకి వెళ్ళనున్నాయా, డెడ్ దిశగా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాయా అంటే ట్రాయ్ కఠిన నిర్ణయాలు నిజమనే సంకేతాలను అందిస్తున్నాయి. మొబైల్ వినియోగదారుల సౌకర్యార్ధం ట్రాయ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్న నేపధ్యంలో ఈ నిర్ణయాలు ఆపిల్ కంపెనీపే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ వినియోగదారులకు రోజూ అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు విపరీతంగా వస్తున్న విషయం విదితమే.అలాంటి కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల వల్ల మొబైల్ వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని భావిస్తున్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ కఠిన చర్యలకు ఆపిల్ ఐఫోన్లు బలి కానున్నాయి.

 

ఫ్లిప్‌కార్ట్ మళ్లీ డిస్కౌంట్లను షురూ చేసిందిఫ్లిప్‌కార్ట్ మళ్లీ డిస్కౌంట్లను షురూ చేసింది

నూతన రెగ్యులేషన్‌..

నూతన రెగ్యులేషన్‌..

అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఓ నూతన రెగ్యులేషన్‌ను త్వరలో అమలు చేయనుంది. ది టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ 2018 పేరిట సదరు రెగ్యులేషన్ అమలు కానుంది.

నిబంధ‌న‌ అమలులోకి వస్తే..

నిబంధ‌న‌ అమలులోకి వస్తే..

ఈ నిబంధ‌న‌ అమలులోకి వస్తే ఆపిల్ ఐఫోన్లు భారత్‌లో పనిచేస్తాయా, లేదా అనే సందేహాలను టెక్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ భద్రత ప్రధాన అంశంగా ముందుకెళుతున్న నేపథ్యంలో ఈ సందేహాలు బయటకు వస్తున్నాయి.

డు నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ)
 

డు నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ)

అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను నియంత్రించేందుకు, వాటిని పంపే ఆపరేటర్లపై చర్యలు తీసుకునేందుకు ట్రాయ్ గతంలోనే డు నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) పేరిట ఓ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ప్రవేశపెట్టింన సంగతి అందరికీ తెలిసిందే.

గూగుల్ ప్లే స్టోర్‌లో..

గూగుల్ ప్లే స్టోర్‌లో..

ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్నది. ఈ యాప్‌ను యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంతో తమకు వచ్చే అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లపై ట్రాయ్‌కు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో సమస్య పరిష్కారమవుతుంది.

ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై..

ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై..

అయితే ఇదే తరహా యాప్‌ను ఇప్పుడు ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా విడుదల చేయాలని ట్రాయ్ భావిస్తున్నది.అయితే ఇలా లాంచ్ చేసే సమయంలో కొన్ని సమస్యలు ట్రాయ్ కి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

డీఎన్‌డీ యాప్‌ను వాడుకోవాలంటే..

డీఎన్‌డీ యాప్‌ను వాడుకోవాలంటే..

ట్రాయ్‌కి చెందిన డీఎన్‌డీ యాప్‌ను వాడుకోవాలంటే ఫోన్‌లోని ఆపరేటింగ్ సిస్టమ్ ఆ యాప్‌కు పూర్తి నియంత్రణ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్‌కు చెందిన కాల్ రికార్డ్స్, ఎస్‌ఎంఎస్‌లను రీడ్ చేసేందుకు యాప్‌కు ఓఎస్ నుంచి పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే యాప్ పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్‌లో ఈ యాప్..

ఆండ్రాయిడ్‌లో ఈ యాప్..

అయితే ఆండ్రాయిడ్‌లో ఈ యాప్ పర్మిషన్ అందుబాటులో ఉంది, కానీ ఐఓఎస్‌లో ఇలాంటి యాప్స్‌ను యాపిల్ అనుమతించదు. యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుందని ఆపిల్ ట్రాయ్‌కి చెందిన డీఎన్‌డీ యాప్‌కు పర్మిషన్లను ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.

ఆపిల్ ఇలాంటి విషయాల్లో..

ఆపిల్ ఇలాంటి విషయాల్లో..

సాధారణంగా ఆపిల్ ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా ఉంటుంది. ఐఫోన్ యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీకి యాపిల్ చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. అందుకనే ట్రాయ్ డీఎన్‌డీ యాప్‌కు ఫుల్ యాప్ పర్మిషన్లు ఇవ్వలేమని ఆపిల్ స్పష్టం చేసింది.

రలో అమలు కానున్న..

రలో అమలు కానున్న..

ఇక త్వరలో అమలు కానున్న ట్రాయ్ కొత్త రెగ్యులేషన్ ప్రకారం డీఎన్‌డీ లాంటి యాప్స్‌కు ఏ స్మార్ట్‌ఫోన్ ఓఎస్ అయినా కచ్చితంగా అన్ని యాప్ పర్మిషన్లు ఇవ్వాల్సిందే.

పర్మిషన్ ఇవ్వకపోతే ..

పర్మిషన్ ఇవ్వకపోతే ..

అలా పర్మిషన్ ఇవ్వకపోతే సదరు ఓఎస్ ఉన్న ఫోన్లకు నెట్‌వర్క్ సర్వీస్ ఇవ్వకుండా వాటిని డీయాక్టివేట్ చేయాలని ట్రాయ్ ఇప్పటికే భారత్‌లోని టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.ఇదే విషయాన్ని కొత్త రెగ్యులేషన్‌లోనూ ట్రాయ్ పొందు పరిచింది.

30 రోజుల లోపు

30 రోజుల లోపు

ఈ క్రమంలో కొత్త రెగ్యులేషన్ అమలులోకి వచ్చిన నాటి నుంచి 30 రోజుల లోపు అన్ని స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ట్రాయ్‌కు చెందిన డీఎన్‌డీ లేదా అదే తరహా యాప్‌లకు అన్ని యాప్ పర్మిషన్లను ఇవ్వాలి.

డీయాక్టివేట్

డీయాక్టివేట్

అలా ఇవ్వకపోతే సదరు ఓఎస్‌లు ఉన్న ఫోన్లను నెట్‌వర్క్ సర్వీస్‌ల నుంచి డీయాక్టివేట్ చేస్తారు. దీంతో ఆపిల్ ఐఫోన్లకు టెలికాం కంపెనీలు నెట్‌వర్క్ సేవలను నిలిపివేస్తాయి. అప్పుడు యూజర్లు ఐఫోన్లను వాడలేరు.

యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో..

యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో..

మరి యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో చాలా కఠిన నిబంధనలు పాటించే ఆపిల్ ట్రాయ్ రెగ్యులేషన్‌కు తలొగ్గుతుందా, లేదా తెలియడం లేదు. ఆపిల్ కంపెనీ నుంచి దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ రాలేదు.

గతంలో ఓ నేరస్తుడి ఐఫోన్‌ను..

గతంలో ఓ నేరస్తుడి ఐఫోన్‌ను..

ఇదిలా ఉంటే గతంలో ఓ నేరస్తుడి ఐఫోన్‌ను అన్‌లాక్ చేసి అందులో ఉన్న సమాచారాన్ని తీసుకుంటామని, సహాయం చేయాలని అమెరికా ఎఫ్‌బీఐ ఆపిల్‌ను సంప్రదించగా ఆపిల్ అందుకు ఒప్పుకోలేదు.

 

కోర్టుకు వెళ్లినా ఎఫ్‌బీఐకి ..

కోర్టుకు వెళ్లినా ఎఫ్‌బీఐకి ..

కోర్టుకు వెళ్లినా ఎఫ్‌బీఐకి చుక్కెదురైంది. ఇక ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి పరిస్థితే ఆపిల్‌కు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక పరంగా ఇండియానే..

ఆర్థిక పరంగా ఇండియానే..

మరి ఆపిల్ కంపెనీకి ఆర్థిక పరంగా ఇండియానే ప్రధాన వనరు కావడంతో ఆపిల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Do Not Disturb

Do Not Disturb

స్పామ్ కాల్స్‌ విసిగిస్తున్నాయా, Do Not Disturbతో తరిమేయండి, సింపుల్ ట్రిక్స్

Best Mobiles in India

English summary
Apple faces deactivation of iPhones in India due to TRAI’s new rules More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X