ఐ ఫోన్ ధరలు భారీగా తగ్గాయి

Written By:

ప్రపంచ మార్కెట్లో ఐ ఫోన్‌ది ఎల్లప్పుడూ ఓ ప్రత్యేక స్థానమే. మార్కెట్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా యాపిల్ ఐ-ఫోన్‌ ధరలు మాత్రం స్థిరంగా ఉంటాయి. అంతర్జాతీయంగా ఈ విషయం నిజమే అయినా భారత్‌ లో మాత్రం విభిన్నంగా ఉంది. ఇక్కడకు వచ్చేసరికి యాపిల్‌ కంపెనీ ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో ఐ-ఫోన్6 ఎస్‌ ధర గణనీయంగా తగ్గింది. తాజాగా ఈ మోడల్‌ ధర 27శాతం పడిపోయి.. ఏకంగా రూ. 45వేలకే కొన్ని ఈ కామర్స్ సైట్లలో లభిస్తున్నది.

Read more : ఐఫోన్ యాపిల్‌ది కాదా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్‌-6ఎస్‌ లాంచ్‌ ధర అక్షరాల రూ. 62వేలు

ఐఫోన్‌-6ఎస్‌ లాంచ్‌ ధర అక్షరాల రూ. 62వేలు

యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా 64 జీబీ మోడల్ ఐఫోన్‌-6ఎస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లాంచ్‌ చేసిన సమయంలో దీని ధర అక్షరాల రూ. 62వేలు.

గోల్డ్ కలర్ ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్ కేవలం రూ. 44,799లకే

గోల్డ్ కలర్ ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్ కేవలం రూ. 44,799లకే

ఇప్పుడు గోల్డ్ కలర్ ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్ కేవలం రూ. 44,799లకే అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అంటే ఈ మోడల్‌ ధర 27శాతం తగ్గింది.

64 జీబీ గ్రే కలర్ మోడల్ ధర మొదట్లో రూ. 72వేలు

64 జీబీ గ్రే కలర్ మోడల్ ధర మొదట్లో రూ. 72వేలు

ఇక 64 జీబీ గ్రే కలర్ మోడల్ ధర మొదట్లో రూ. 72వేలు ఉండగా.. ఇప్పుడు అది రూ. 57,699కే లభిస్తున్నది.

20శాతం డిస్కౌంట్‌ తో రూ. 65,490లకే

20శాతం డిస్కౌంట్‌ తో రూ. 65,490లకే

పేటీఎంలోనూ ఐఫోన్‌ 6ఎస్‌ తక్కువ ధరకు లభిస్తున్నది. 6ఎస్‌ 128 జీబీ మోడల్ వాస్తవ ధర రూ. 82వేలు కాగా.. 20శాతం డిస్కౌంట్‌ తో రూ. 65,490లకే ఈ ఫోన్‌ లభిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోడల్‌ రూ. 49,999కి

ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోడల్‌ రూ. 49,999కి

పేటీఎంలో ఐఫోన్‌ 6ఎస్‌ 64 జీబీ బేస్ మోడల్‌ రూ. 66,489కి లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోడల్‌ రూ. 49,999కి లభిస్తున్నది.

యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 6ఎస్‌ విషయంలో చేదు అనుభవమే

యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 6ఎస్‌ విషయంలో చేదు అనుభవమే

భారత మార్కెట్‌లో భారీగా తన వాటా పెంచుకోవాలని భావిస్తున్న యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 6ఎస్‌ విషయంలో చేదు అనుభవమే ఎదురైంది.

2014, 2015 సంవత్సరాల్లో ఐఫోన్‌ 6

2014, 2015 సంవత్సరాల్లో ఐఫోన్‌ 6

2014, 2015 సంవత్సరాల్లో ఐఫోన్‌ 6 సాధించిన అమ్మకాలను.. 6ఎస్‌ మోడల్‌ సాధించకపోవడంతో వాటి ధరలు దిగివచ్చినట్టు పరిశీలకులు చెప్తున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple iPhone 6S price drops by more than 27 per cent online
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting