ఐఫోన్ యాపిల్‌ది కాదా..?

Written By:

స్టీవ్ జాబ్స్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన యాపిల్ ఐఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేసిన యాపిల్ ఐఫోన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన హుందాతనంతో ప్రపంచ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

ఐఫోన్ యాపిల్‌ది కాదా..?

2007, జూన్ 29న స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసారు. అప్పటి నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసిస్తూనే వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌‍‌షోలో చూడొచ్చు...

20 సెకన్లలో 95,000 ఫోన్‌లు సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాస్తవానికి ‘ఐఫోన్' ట్రేడ్‌మార్క్ యాపిల్‌ది కాదు

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

‘ఐఫోన్' ట్రేడ్‌మార్క్ వాస్తవానికి సిస్కో కంపెనీది. 2007లో మొదటి ఐఫోన్ ఆవిష్కరణ తరువాత ఈ రెండు కంపెనీలు కూర్చొని ట్రేడ్‌మార్క్ సమస్యను సెటిల్ చేసుకున్నారు.

 

మొదటి ఐఫోన్ కాన్సెప్ట్ 1983లో రూపుదిద్దుకుంది

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

యాపిల్ కంప్యూటర్ డెవలపర్ Hartmut Esslinger యాపిల్ ఐఫోన్‌కు సంబంధించిన మొదటి కాన్సెప్ట్‌ను 1983లో డిజైన్ చేసారు.

 

మీరు గమనించారో లేదో

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

మీరు గమనించారో లేదో యాపిల్ ఐఫోన్ యాడ్‌లలో సమయం ఎప్పుడు 9:41amగానే కనిపిస్తుంటుంది. ఇందుకు కారణం స్టీవ్ జాబ్స్ నేతృత్వంలోని మొదటి ఐఫోన్ ఆవిష్కరణ అదే సమయంలో జరిగింది.

ఐఫోన్ ప్రాసెసర్‌లను సామ్‌సంగ్ తయారు చేసింది

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

మీరు వింటున్నది నిజమే, ఒకప్పుడు యాపిల్ ఐపోన్‌లకు సంబంధించిన ప్రాసెసర్‌లను సామ్‌సంగ్ అభివృద్ధి చేసేది.

 

కవర్ పేజీ పై

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

2007 టైమ్ మేగజైన్ కవర్ పేజీ పై ఐఫోన్‌ను ముద్రించారు.

‘రెటీనా డిస్‌ప్లే’ చాలా ఖరీదైనది

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

యాపిల్ ఐఫోన్‌లో ఖరీదైన భాగం ‘రెటీనా డిస్‌ప్లే'

యాపిల్ ఆధీనంలో 200 పేటెంట్ హక్కులు

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

ఐఫోన్‌ టెక్నాలజీకి సంబంధించిన 200 పేటెంట్ హక్కులు యాపిల్ వద్ద ఉన్నాయి.

700 మిలియన్ల ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

యాపిల్ ఇప్పటి వరకు 700 మిలియన్ల ఐఫోన్‌లను విక్రయించింది.

ఐఫోన్ ఆలోచన మొదలైంది అక్కడ నుంచే

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

ఐఫోన్ ఆలోచన యాపిల్ ఐప్యాడ్ ప్రాజెక్ట్ నుంచి పుట్టుకొచ్చింది.

లాభాలు తెచ్చిపెట్టిన ఉత్పత్తుల్లో

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

యాపిల్ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టిన ప్రముఖ ఉత్పత్తుల్లో ఐఫోన్ ఒకటి.

ప్లాస్టిక్ డిస్‌ప్లేతో

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

వాస్తవానికి యాపిల్ తన మొదటి ఐఫోన్ ప్రోటోటైప్‌కు ప్లాస్టిక్ డిస్‌ప్లేను ఉంచింది. స్టీవ్ జాబ్స్ ఈ ఫోన్‌ను పరీక్షించిన తరువాత తన అసంతృప్తిని వ్యక్తం చేయటంతో గ్లాస్ డిస్‌ప్లేను అమర్చారు.

ఐఫోన్ ప్రాజెక్ట్ చాలా రహస్యంగా సాగింది

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

తన ఐఫోన్ ప్రాజెక్ట్ రూపకల్పనలో భాగంగా స్టీవ్ జాబ్సా చాలా పకడ్బందీగా వ్యవహరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆయన బయట వ్యక్తులను ఎంపిక చేసుకోలేదట. తన సంస్థలోని వివిధ సెక్షన్‌లకు చెందిన ఇంజినీర్లను ఈ ప్రాజెక్టులో మమేకం చేసినప్పటికి వారికి ఇదేంటో తెలియనివ్వలేదట.

 

కర్వుడ్ డిస్‌ప్లేతో

యాపిల్ ఐఫోన్ గురించి ఆసక్తికర విషయాలు

వాస్తవానికి యాపిల్ ఐఫోన్‌ను కర్వుడ్ డిస్‌ప్లేతో అందిద్దామనుకున్నారట. అయితే, తయారీ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆ ఆలోచనను విరమించుకున్నారట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Fascinating Facts About Apple iPhones!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting