ఐఫోన్ 7 వాడేవారికి కూడా ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలియదు

Written By:

మీరు కొత్తగా ఐఫోన్ కొన్నారా..అయితే మీ దురదృష్టం కొద్దీ ఐఫోన్ 7 లో హోమ్ బటన్ పనిచేయడం మానేసిందనుకోండి...ఫోన్ పై ఎక్కడ లేని కోపమొస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి వాటికి కూడా ఆపిల్ ముందే పరిష్కారాన్ని చూపింది. హోమ్ బటన్ పనిచేయకపోయినా మీరు మరొక హోమ్ బటన్ ని వాడుకోవచ్చు..అదీ చాలా సీక్రెట్ గా దాగి ఉంటుందని ఆపిల్ ట్రాకింగ్ వెబ్‌సైట్ చెబుతోంది.

రూపాయికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వర్చ్యువల్ బటన్‌

ఐఫోన్ 7 హోమ్ బటన్ పనిచేయని సందర్భంలో ఓ వర్చ్యువల్ బటన్‌ను(దాగిఉన్న హోమ్ బటన్) ఆపిల్ సంస్థ ఐఫోన్7లో పొందుపరిచిందట.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పనిచేయడం ఆగిపోయినప్పుడు

ఫిజికల్ హోమ్ బటన్ పనిచేయడం ఆగిపోయినప్పుడు, వెంటనే ఈ వర్చ్యువల్ బటన్ ఆన్ అయిపోతుందని ఆపిల్-ట్రాకింగ్ వెబ్‌సైట్ మ్యాక్ రూమర్స్ వెల్లడించింది.

స్క్రీన్ కింద భాగంలో

అయితే ఈ వర్చ్యువల్ హోమ్ బటన్ ను ఐఫోన్7 ఫోన్ల స్క్రీన్ కింద భాగంలో ఆపిల్ సంస్థ అమర్చిందని వెల్లడించింది. ఐఫోన్7 హోమ్ బటన్‌ను ఈ ఏడాదే కొత్తగా రీడిజైన్ చేశారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫింగర్ ప్రింట్ సెన్సార్, అదనపు ఒత్తిడితో

ఈ కొత్త హోమ్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అదనపు ఒత్తిడితో దీన్ని ఆన్ చేయవచ్చు. బటన్‌ను యూజర్లు నొక్కినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది. అదేవిధంగా ఆ బటన్ యాక్టివేట్ అయినట్టు యూజర్లకు వెంటనే తెలిసిపోతుందని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది.

ఈ ఫీచర్ టెక్నికల్‌గా

ఈ ఫీచర్ టెక్నికల్‌గా దాగిఉంటుందని, ఫిజికట్ బటన్ పనిచేయనప్పుడు, ఇది ఆన్ అవుతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పాత పద్ధతులకు స్వస్తి చెబుతూ హోమ్ బటన్‌లో మార్పులు తీసుకురావాలని ఆపిల్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత రాబోతున్న గ్లాస్ వేరియంట్ల కోసం

ఐఫోన్ నుంచి తర్వాత రాబోతున్న గ్లాస్ వేరియంట్ల కోసం హోమ్ బటన్‌లో ఆపిల్ మార్పులు తెస్తున్నట్టు సమాచారం. చిన్నచిన్నగా ఫిజికల్ హోమ్ బటన్ల వాడకాన్ని ఆపిల్ సంస్థ తొలగిస్తుందని టాక్ కూడా వినిపిస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 7 has hidden home button on screen read more at telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting