Home
Mobile

ఐఫోన్ 7,7 ప్లస్ బుకింగ్స్ రెడీ..అడ్వాన్స్ ఎంతంటే..

By Hazarath

ఆపిల్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ 7, 7 ప్లస్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇండియాలో ఆపిల్ కు భాగస్వామిగా ఉన్న యునికార్న్ ఈ ముందస్తు బుకింగ్ లను స్వీకరిస్తోంది. ఎవరైనా ఐ ఫోన్ 7, 7 ప్లస్ తీసుకోవాలంటే రూ. 5 వేలు అడ్వాన్స్‌గా డిపాజిట్ చేసి ఫ్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బుక్ చేసుకున్నవారికి అక్టోబర్ 7 నుంచి ఫోన్ల డెలివరీ ప్రారంభమవుతుంది.దీంతో పాటు ఆపిల్ వెబ్ సైట్ లోనూ అలాగే ఆపిల్ షోరూంలలో కూడా ఫ్రీ బుకింగ్స్ స్వీకరిస్తున్నారు.

ఆపిల్ ఐఫోన్ 7 చీప్‌గా దొరికేది ఎక్కడో తెలుసా..?

IPHONE7

అయితే ఇండియాలో అతిపెద్ద రీటైల్ షోరూం టాటా గ్రూప్ క్రోమా, రిలయన్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో మాత్రం ఐఫోన్ల ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కాలేదు. తొలి దశలో 28 దేశాల్లో సెప్టెంబర్ 16 నుంచి, ఆపై 23 నుంచి మరో 25 దేశాల్లో ఐఫోన్లు విడుదల కానుండగా, ఆపై రెండు వారాల తరువాత మూడవ దశలో ఇండియాకు ఫోన్ల తొలి బ్యాచ్ రానుంది. 7 మోడల్ లో 32 జీబీ వర్షన్ ధరను రూ. 60 వేలుగా కంపెనీ నిర్ణయించింది.

కొత్త షాక్: ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లు చాలా డేంజర్ !

డిస్‌ప్లే

డిస్‌ప్లే

మునుపటి ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే, 25శాతం ప్రకాశవంతమైన డిస్‌ప్లే వ్యవస్థతో వస్తోన్న కొత్త ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో వైడ్ కలర్ gamut, 3డీ టచ్ మేనేజ్ మెంట్, 3డీ టచ్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

ఆపిల్ ఐఫోన్ 7 డిస్‌ప్లే

ఆపిల్ ఐఫోన్ 7 డిస్‌ప్లే

ఆపిల్ ఐఫోన్ 7 డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి, ఈ హ్యాండ్‌సెట్‌‌లో 4.7 అంగుళాల Retina HD డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. మరో వైపు ఐఫోన్ 7 ప్లస్‌, 5.5 అంగుళాల Retina HD డిస్‌ప్లేతో కనువిందు చేస్తుంది.

ప్రాసెసర్‌

ప్రాసెసర్‌

ఈ రెండు ఫోన్‌లు శక్తివంతమైన A10 Fusion ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ఈ 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ గతేడాది యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చిన A9 ప్రాసెసర్‌తో పోలిస్తే 40 శాతం వేగంగా స్పందించగలదు.

 

 

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

ఆపిల్ సరికొత్త iOS 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ రెండు ఐఫోన్‌లు రన్ అవుతాయి.

స్టోరేజ్

స్టోరేజ్

ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ బేస్ మోడల్స్ 32జీబి వేరియంట్ నుంచి ప్రారంభమవుతాయి. 128జీబి, 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంటాయి.

 

 

హోమ్‌బటన్ వ్యవస్థ

హోమ్‌బటన్ వ్యవస్థ

ఆపిల్ తన కొత్త ఐఫోన్‌లలో హోమ్‌బటన్ వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. యూజర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సరికొత్త టాప్టిక్ ఇంజిన్‌తో పని చేసే ఈ హోమ్‌బటన్ ఇప్పుడు మరింత ఫోర్స్ సెన్సిటవ్ గా అనిపిస్తుంది.

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో ఐపీ67 ప్రొటెక్షన్ స్టాండర్డ్‌తో కూడని వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సామర్థ్యాలను పొందుపరిచారు. ఇవి నీటిలో పడినప్పటికి ఎటువంటి ప్రమాదాలకు గురికావు.

కెమెరా

కెమెరా

ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో విప్లవాత్మక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు six element లెన్స్‌ను ఆపిల్ నిక్షిప్తం చేసింది.

 ఫ్రంట్ కెమెరా

ఫ్రంట్ కెమెరా

TrueTone Flash ఫ్లాష్‌తో కూడిన 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను ఐఫోన్ 7 కలిగి ఉంటుంది. కెమెరాలో పొందుపరిచిన f/1.8 aperture మరింత బ్రైట్నెస్‌ను అందిస్తుంది. ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగా పిక్సల్. లైవ్ ఫోటోలను కూడా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

డ్యుయల్ కెమెరాతో ఐఫోన్ 7 ప్లస్

డ్యుయల్ కెమెరాతో ఐఫోన్ 7 ప్లస్

మరోవైపు ఐఫోన్ 7 ప్లస్ రెండు 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాలతో వస్తోంది. ఈ డ్యుయల్ కెమెరా సెటప్‌లో భాగంగా మొదటి కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటే, మరొక కెమెరా telephoto ఫీచర్ ను కలిగి ఉంటుంది. డీఎస్ఎలఆర్ తరహా డెప్త్ ఫోటోగ్రఫీని ఐఫోన్ 7 ప్లస్ అందించగలదు. ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగా పిక్సల్.

స్టీరియో స్పీకర్

స్టీరియో స్పీకర్

ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్ ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్ వ్యవస్థతో వస్తున్నాయి. ఫోన్ టాప్ అలానే బోటమ్ భాగాల్లో ఏర్పాటు చేసిన స్పీకర్లు ఫోన్ వాల్యుమ్ స్థాయిని మరింత హై డైనమిక్ రేంజ్ లో అందిస్తాయి. ఆపిల్ తన కొత్త ఫోన్‌లలో 3.5ఎమ్ఎమ్ ఆడియా జాక్ కు బదులుగా లైట్నింగ్ పోర్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌

వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌

వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పై దృష్టిసారించిన ఆపిల్ తమ ఐఫోన్ 7 మోడల్స్ కోసం AirPods పేరుతో విప్లవాత్మక వైర్ లెస్ ఇయర్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపిల్ డిజైన్ చేసిన W1 చిప్ ఆధారంగా పనిచేసే ఈ ఇయర్‌ఫోన్‌ల సరికొత్త వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయి.

బ్యాటరీ

బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వచ్చే సరికి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను ఆపిల్ నిక్షిప్తం చేసింది. ఐఫోన్ 6ఎస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 బ్యాటరీ 40 శాతం మెరుగుపరచబడి పనితీరును కనబర్చగలదట. మరోవైపు ఐఫోన్ 6ఎస్‌ ప్లస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 ప్లస్‌ బ్యాటరీ అదనంగా 60 నిమిషాల బ్యాటరీ లైఫ్‌ను పెంచగలదట.

మూడు స్టోరేజ్ వేరియంట్స్

మూడు స్టోరేజ్ వేరియంట్స్

Apple ఇండియా వెబ్‌సైట్ రివీల్ చేసిన వివరాల ప్రకారం ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ మోడల్స్ అక్టోబర్ 7 నుంచి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రారంభ ధర రూ.60,000గా ఉంటుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ మోడల్స్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

EarPod

EarPod

ప్రతి బండిల్ ప్యాక్‌లోనూ లైట్నింగ్ కనెక్టర్‌తో కూడిన EarPodతో పాటు 3.5ఎమ్ఎమ్ Headphone Jack Adapterను అందిస్తారు. వీటికి విడిగా ఛార్జ్ ఉంటుంది. లైట్నింగ్ కనెక్టర్ ధర రూ.2,500 కాగా, హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్ ధర రూ.900గా ఉంటుంది. ఆపిల్ అందిస్తోన్న సరికొత్త వైర్‌లెస్ AirPods ధర రూ.15,400గా ఉంటుంది.

మరిన్ని స్టోరీల కోసం

మరిన్ని స్టోరీల కోసం

షాక్: ఆపిల్ ఐఫోన్ 7 ఫీచర్స్ రూ.10 వేల ఫోన్లలో దొరుకుతున్నాయి. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి 
l

Best Mobiles in India

English summary
Apple iPhone 7, iPhone 7 Plus available for pre-orders in India Read more gizbot telugu..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X