షాక్: ఆపిల్ ఐఫోన్ 7 ఫీచర్స్ రూ.10 వేల ఫోన్లలో దొరుకుతున్నాయి!
ఐఫోన్ అభిమానులకు ఇది నిజంగా చేదులాంటి వార్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ 7లో ఫీచర్లలో కొత్త దనమేమి కనిపించడం లేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. పుల్ హైప్ క్రియేట్ చేస్తూ దూసుకొచ్చిన ఐ ఫోన్7 వెర్షన్ లో రూ. 10 వేల లోపు ఫోన్లలో ఉన్న ఫీచర్లు కూడా లేవని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఈ ఫీచర్లను అరువుకు తెచ్చుకున్నట్లుగా ఐ ఫోన్ 7 తయారైందని విమర్శిస్తున్నారు..మరి ఆ ఫీచర్లేంటో మీరే చూడండి.
ఐఫోన్7పై ఆపిల్ వార్నింగ్ : జాగ్రత్తగా ఉండాలని పిలుపు

#1
కెమెరా విషయానికొస్తే.. పిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్‌లో కెమెరాపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొంది. డ్యూయల్ కెమెరాతో వినియోగదారుల ముందుకు వచ్చింది. కానీ ఆ ఫీచరేమీ ఐఫోన్7కు ప్రత్యేకంగా నిలవడం లేదట.

#2
2014లోనే డ్యూయల్ కెమెరాతో హెచ్‌టీసీ తన స్మార్ట్‌ఫోన్ ఎం8ను లాంచ్ చేసిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. రూ.10వేల ధరలోనే ఈ ఫీచర్‌తో ఆ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయట. డ్యూయల్ కెమెరా సెట్ అప్‌తో ఎక్కువ ప్రీమియం ఆఫర్ చేసే ఫోన్లు ఎల్‌జీ జీ5, హ్యువాయ్ పీ9లు ఐఫోన్7 ప్లస్‌కు సగం ధరలోనే మార్కెట్లో లభ్యమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

#3
వాటర్ ఫ్రూప్ విషయానికొస్తే.. నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ కల్పించే విధంగా ఐపీ67 వాటర్ ఫ్రూప్ ప్రమాణాల మేరకు ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్?లను ఆపిల్ లాంచ్ చేసింది.

#4
ఈ ఫీచర్‌ను కూడా నాలుగేళ్ల క్రితమే సోనీ తన ఎక్స్‌పీరియా జడ్ స్మార్ట్‌ఫోన్‌తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ కూడా తక్కువ ధరలోనే తన ఎస్7, ఎస్7 ఎడ్జ్ ఫోన్లను విక్రయిస్తోందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు..

#5
సెన్సార్ విషయానికొస్తే.. గతేడాదే ఐఫోన్6ఎస్/6ఎస్ ప్లస్ ఫోన్లలో 5 ఎంపీ సెన్సార్‌ను అప్‌గ్రేడ్ చేసిన ఆపిల్, కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 7 ఫోన్లలో 7ఎంపీ సెన్సార్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కానీ రూ.15,000 సెగ్మెంట్‌లోనే 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫోన్లు వినియోగదారుల ముందు ఈ ఫీచర్‌తో అలరిస్తున్నాయట.

#6
ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఐఫోన్7కు సరితూగడం లేదని భావిస్తే, జియోని ఎస్6ఎస్, ఓప్పో ఎఫ్1లు ఫ్రంట్ కెమెరాలో అద్భుతమైన ఫలితాలను ప్రదర్శిస్తున్నాయని వారు వివరిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో బెస్ట్ ఫోన్లన్ని ఇప్పటికే రుజువైందని స్పష్టంచేశారు.

#7
ఇక హెడ్ ఫోన్స్ విషయానికొస్తే.. ఊహించినట్టుగానే 3.5ఎంఎం హెడ్‌జాక్‌ను ఆపిల్ ఈ కొత్త ఫోన్లలో తొలగించింది. కానీ 3.5ఎంఎం కోరుకునే వారికోసం అడాప్టర్‌ను అందిస్తోంది ఆపిల్. అదేవిధంగా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఇందులో ప్లస్ పాయింట్ అని ఆపిల్ చెబుతోంది.

#8
అయితే ఇవే ఫీచర్లను లీఇకో తన లీ2, లీమ్యాక్స్2 ఫోన్లను ఆఫర్ చేస్తోందని టెక్ విశ్లేషకుల వాదన. యూఎస్‌బీ టైప్-సీ పోర్టును లీఇకో కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి తీసుకొచ్చిందని, లీఇకో ఆఫర్ చేస్తున్న ఈ అధిక క్వాలిటీ యూఎస్‌బీ టైప్-సీ హెడ్ ఫోన్లనూ ఆపిల్ కొత్త ఫోన్లకు జోడించడం ప్రత్యేకతేమి లేదంటున్నారు విశ్లేషకులు.

#9
స్టీరియో స్పీకర్స్ విషయానికొస్తే.. మరో ఆండ్రాయిడ్ ఫీచర్ స్టీరియో స్పీకర్స్. తొలి సారిగా ఐఫోన్7లో స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేశారు. కొత్త ఫోన్లలోని స్టీరియో స్పీకర్లు ఉండడంతో సినిమా వీక్షణ అనుభవం సరికొత్తగా ఉండే అవకాశం ఉందని ఆపిల్ హామి ఇస్తోంది..

#10
అయితే ఇప్పటికే చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు చాలా ఏళ్ల నుంచే స్టీరియో స్పీకర్లను ఆఫర్ చేస్తున్నాయట. హెచ్‌టీసీ ఈ స్టీరియో స్పీకర్ల ట్రెండ్‌ను సృష్టిస్తే అనంతరం లెనోవా, మోటరోలా వంటి మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

#11
ఇలాంటి ఫీచర్లు ఇది వరకే వస్తే ఇప్పుడు ఆపిల్ కొత్తగా తీసుకువచ్చిందేమి లేదని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

#12
అయితే బ్రాండ్ అనేది మాత్రం ఆపిల్ కే సాధ్యమని అభిమానులు బ్రాండ్ ను చూసి కొంటారని మరికొంతమంది చెబుతున్నారు. మరి ప్రపంచ రారాజు ఆపిల్ నుంచి వచ్చిన ఐ ఫోన్ 7 అమ్మకాలు ఏ దిశగా సాగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications








