రూ. 15 వేలకే ఐఫోన్ 5ఎస్ !

Written By:

ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లంటే చాలామంది పడిచస్తారు. చైనాలో అయితే ఏకంగా కిడ్నీలు అమ్ముకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అంతటి డిమాండ్ ఉన్న ఐఫోన్లు ఎలాగైనా సొంతం చేసుకోవాలని చాలామంది అనుకుంటారు కదా. అటువంటి వారి కోసం ఆపిల్ ఇప్పుడు డిస్కౌంట్ తో ఐఫోన్ 5ఎస్ ని తీసుకొచ్చింది. రూ. 18 వేల విలువ గల ఈ ఫోన్ ను రూ. 3 వేలు తగ్గించి రూ. 15 వేలకే వినియోగదారులకు అందిస్తోంది. అన్ లైన్ లో మీకు లభ్యమవుతుంది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

ఫోనంటే ఇదేరా బుజ్జీ.. సవాళ్లకే వణుకు పుట్టిస్తోంది !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజన్ ఇంకా నిర్మాణం

ఐఫోన్ 5 తరహాలోనే ఐఫోన్ 5ఎస్ అల్యుమినియమ్ చాసిస్, గ్లాస్ ప్యానల్, chamfered edgesతో కనిపిస్తుంది. మరోవైపు వన్ ప్లస్ 2 మెటల్ అలానే సాండ్‌స్టోన్ ఫినిషింగ్ బ్యాక్ కవర్‌తో వస్తోంది. 

డిస్‌ప్లే విషయానికొస్తే..

ఐఫోన్ 5ఎస్ డిస్‌ప్లే విషయానికొస్తే 4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 640x 1136పిక్సల్స్, 326 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఓలియోఫోబిక్ కోటింగ్ వంటి ప్రత్యేకతలు ఈ డిస్‌ప్లేకు ఉన్నాయి.

హార్డ్‌వేర్ విషయానికొస్తే ..

ఐఫోన్ 5ఎస్‌లో యాపిల్ తన సొంత ఏ7 చిప్‌సెట్‌ను పొందుపరిచింది. ఈ చిప్ సెట్‌లో 1.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన సైక్లోన్ ప్రాసెసర్ అలానే పవర్ వీఆర్ సీ6430 క్వాడ్‌కోర్ గ్రాఫిక్ ప్రాసెసర్‌లు ఉంటాయి. 1జీబి ర్యామ్.

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే..

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే ఐఫోన్ 5ఎస్ ఆపిల్ సొంత ఆపరేటింగ్ సిస్టం అయిన ఐఓఎస్7 పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే

ఐఫోన్ 5ఎస్ కెమరా స్పెక్స్ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, టచ్ ఫోకస్, ఫేస్/స్మైల్ డిటెక్షన్, పానోరమా, హెచ్‌డీఆర్) 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఫేస్ డిటెక్షన్, ఫేస్‌టైమ్ ఓవర్ వై-ఫై),

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple likely to reduce the price of iPhone 5s in India to Rs 15,000 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot