Home
Mobile

ఐఫోన్ లవర్స్‌కి కిర్రాక్ న్యూస్.. ఐఫోన్ 17 సిరీస్‌లో కళ్లు చెదిరే మార్పులు..!

iPhone 17 Air and Ultra: 2025లో ఐఫోన్ 17 సిరీస్‌తో (https://telugu.gizbot.com/mobile/iphone-17-series-dummy-units-photos-leaked-online-here-are-the-full-details-038671.html ) అందర్నీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది ఆపిల్. ప్రస్తుతం వస్తున్న లీక్స్ ప్రకారం, ఆపిల్ ఐఫోన్ లైనప్‌లో పెద్ద మార్పులు చేయబోతోంది. ఐఫోన్ 17 సిరీస్‌లో ఇకపై ఐఫోన్ ప్లస్, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌ మోడల్స్ కనిపించకపోవచ్చు. వాటి స్థానంలో కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 అల్ట్రా మోడల్స్‌ను తీసుకురావడానికి ఆపిల్ ప్లాన్ చేస్తోంది.

స్లిమ్ డిజైన్‌తో ఒక కొత్త మోడల్, అలాగే ప్రీమియం ఫీచర్లతో మరో టాప్ ఎండ్ మోడల్‌ను రిలీజ్ చేసి మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది ఆపిల్. లక్ష పైన శాంసంగ్ అల్ట్రా ఫోన్లు అదిరిపోయే ఫీచర్లతో వస్తున్నాయి. ఇప్పుడు ఆపిల్ కూడా అదే బాటలో నడవనుంది.

Apple may replace iPhone Plus and Pro Max with iPhone 17 Air and iPhone 17 Ultra

* ఐఫోన్లకే రారాజు ఐఫోన్ 17 అల్ట్రా..

ఐఫోన్ 17 అల్ట్రా మోడల్ ఆపిల్ నుంచి వచ్చే టాప్ మోడల్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ ప్రో మ్యాక్స్‌ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది. ఈ ఫోన్‌లో కొన్ని అదిరిపోయే ఫీచర్లు ఉండబోతున్నాయని లీక్స్ ద్వారా తెలుస్తోంది. చిన్న 'డైనమిక్ ఐలాండ్' డిస్‌ప్లే, ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వొచ్చు.

ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లను ఇందులో చూడొచ్చు. పేరుకు తగ్గట్టే, ఐఫోన్ 17 అల్ట్రా మిగతా ఐఫోన్ మోడల్స్‌ను మించిపోయే పర్ఫార్మెన్స్, ఫీచర్లతో వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ వాచ్ అల్ట్రా లాగే, ఈ అల్ట్రా బ్రాండింగ్‌ను కూడా టాప్-ఎండ్ డివైజ్‌ల కోసమే ఆపిల్ వాడుతుండటం విశేషం.

* ఐఫోన్ 17 ఎయిర్ సన్నగా ఉంటుంది

ఐఫోన్ 17 ఎయిర్ విషయానికి వస్తే, ఇది ఐఫోన్ ప్లస్ మోడల్‌కు భర్తీగా వస్తోంది. ఐఫోన్ ప్లస్ మోడల్ అమ్మకాలు అనుకున్నంతగా లేకపోవడంతో ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐఫోన్ 16 కంటే 30% సన్నగా ఉండబోయే ఐఫోన్ 17 ఎయిర్, ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లలోనే చాలా స్లిమ్ ఫోన్‌గా నిలవనుంది.

ఐఫోన్ ప్లస్ లో 6.7-అంగుళాల స్క్రీన్ ఉండగా, ఐఫోన్ 17 ఎయిర్ లో కొంచెం చిన్నదైన 6.6-అంగుళాల డిస్‌ప్లే ఉండొచ్చు. సైజు కాస్త తగ్గినా, పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోతుందని అంటున్నారు. మిగతా మోడల్స్ విషయానికి వస్తే, ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మోడల్స్ కూడా మార్కెట్లోకి వస్తాయి.

మిడ్-రేంజ్, హై-ఎండ్ యూజర్లను టార్గెట్ చేస్తూ ఈ మోడల్స్ రిలీజ్ అవుతాయి. మొత్తానికి ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 అల్ట్రా మోడల్స్‌తో ఆపిల్ ఐఫోన్ లైనప్‌కు కొత్త లుక్ తీసుకురావాలని చూస్తోంది. అయితే, ఇవన్నీ లీక్ అయిన వార్తలే. యాపిల్ ఇంకా ఈ మార్పులపై అధికారికంగా ఏమీ చెప్పలేదు.

2025 చివర్లో జరిగే లాంచ్ ఈవెంట్‌లో అసలు విషయం తెలుస్తుంది. కానీ, ఈ రీబ్రాండింగ్ నిజంగా జరిగితే, ఆపిల్ ఐఫోన్ లైనప్‌లో ఇదొక పెద్ద మార్పు చెప్పుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple may replace the iPhone Plus and Pro Max with the iPhone 17 Air and Ultra in 2025, introducing a refreshed, slimmer, and more premium lineup.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X