కమింగ్ సూన్: మునుపెన్నడూ లేని ఫీచర్లతో ఐఫోన్8

Written By:

ఆపిల్ అంటేనే ఓ క్రేజ్.ఆ కంపెనీ ఫోన్లంటేనే చాలామంది అదొక స్టేటస్‌గా భావిస్తారు. ఇప్పటికే చాలామంది ఐఫోన్ కోసం ఎన్నో రిస్క్ లు కూడా చేశారని పేపర్లలో, సోషల్ మీడియాలో చదివాం. అయితే మార్కెట్లోకి ఐఫోన్ 7, 7ప్లస్ అలా వచ్చిందో లేదో ఇప్పుడు ఐఫోన్ 8 అప్పుడే సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

రూ. 99 చెల్లిస్తే రూ.10 వేల ఫోన్ మీ సొంతం: జియో సిమ్ ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7 వర్షన్ అమ్మకాలు

ఆపిల్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 7 వర్షన్ అమ్మకాలు ఇంకా ఇండియాలో ప్రారంభమే కాలేదు, అప్పుడే వచ్చే సంవత్సరం మార్కెట్లోకి వచ్చే ఐఫోన్ 8వ తరం స్మార్ట్‌ఫోన్ పై ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి.

వచ్చే సంవత్సరం జూన్ 29న

ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. తొలి ఐఫోన్ 2007 జూన్ 29న రాగా, సరిగ్గా పదేళ్లకు అంటే వచ్చే సంవత్సరం జూన్ 29న దీన్ని విడుదల చేయాలని ఆపిల్ భావిస్తోందట.

ఎల్సీడీ స్క్రీన్ బదులు ఓఎల్ఈడీ డిస్ ప్లే

ఇక ఇప్పటివరకూ వచ్చిన అన్ని ఐఫోన్ మోడళ్లతో సంబంధం లేకుండా తయారయ్యే ఈ ఫోన్ లో ఎల్సీడీ స్క్రీన్ బదులు ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుందని సమాచారం. 5.5 ఇంచ్ లార్జర్ డిస్ ప్లే ఉంటుందని సమాచారం.

రూ. 3,800 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ తో

యూఎస్ పత్రిక 'బ్లూమ్ బర్గ్' ప్రచురించిన కథనం ప్రకారం, మరింత స్పష్టంగా కనిపించేలా ఓఎల్ఈడీ డిస్ ప్లే తెరలను 'షార్ప్' తయారు చేస్తోంది. మొత్తం రూ. 3,800 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ తో ఈ ప్యానళ్ల తయారీ ఇప్పటికే మొదలైంది.

వర్చ్యువల్ బటన్

ఈ వేరియంట్ లో హోమ్ బటన్ ఉండదట. దీని స్థానంలో తమకు మాత్రమే పేటెంట్ హక్కులున్న వర్చ్యువల్ బటన్ ను వాడాలని ఆపిల్ భావిస్తోంది. దీని వల్ల స్క్రీన్ సైజ్ ను పెంచి ఫోన్ ను మరింత ఆకర్షణీయం చేయవచ్చని యాపిల్ భావిస్తున్నట్టు పత్రిక పేర్కొంది.

రాడికల్ డిజెన్ తో పాటు

రాడికల్ డిజెన్ తో పాటు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో ఐఫోన్ 8 రానున్నట్లు తెలుస్తోంది. డిస్ ప్లేని టచ్ చేస్తే ప్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ అయ్యేలా రూపొందించనున్నారని రూమర్లు తెలియజేస్తున్నాయి.

10-nanometer A11 chipతో

రానున్న ఈ ఫోన్ 10-nanometer A11 chipతో రానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లాంగ్ రేంజ్ వైర్ లెస్ ఛార్జింగ్ తో వస్తుందని సమాచారం. అలాగే ఐరిస్ ఫేసియల్ స్కానింగ్ ఉంటే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
IPhone 8: Release date, price, rumours and news about Apples 2017 iPhone Read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot