రూ. 99 చెల్లిస్తే రూ.10 వేల ఫోన్ మీ సొంతం: జియో సిమ్ ఉచితం

Written By:

మొబైల్ రీటైల్ రంగంలో దూసుకుపోతున్న సంగీత సంస్థ ఇప్పుడు తన కష్టమర్ల కోసం కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని వినియోగదారులకోసం పలు స్కీములను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంగీత మొబైల్స్ వెబ్‌సైట్‌లో ఉంచారు. సంగీత మొబైల్స్ కి కష్టమర్లకి ఇస్తున్న ఆఫర్ల వివరాలేంటో ఓ సారి చూద్దాం.

ఈ కామర్స్ దిగ్గజాలకు ఫేస్‌బుక్ దిమ్మతిరిగే షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.1,000 క్యాష్

ఈ స్కీమ్ లో భాగంగా మీరు ఏ కంపెనీకి చెందిన పాత స్మార్ట్‌ఫోన్ అయినా సంగీత మొబైల్ స్టోర్‌లో అందజేసి రూ.1,000 క్యాష్ పొందవచ్చు.

ప్రతి స్మార్ట్‌ఫోన్ పై రిలయన్స్ జియో సిమ్ ఉచితం

అలాగే మీరు కొనుగోలు చేసే ప్రతి స్మార్ట్‌ఫోన్ పై రిలయన్స్ జియో సిమ్ ఉచితంగా ఇవ్వబడుతుంది.

రూ. 99 చెల్లిస్తే రూ.10 వేల ఫోన్ మీ సొంతం

రూ.10 వేలు, అంత కంటే ఎక్కువ విలువ చేసే మొబైల్‌ను తొలివిడతగా రూ.99 చెల్లించి తీసుకోవొచ్చు. మిగిలిన మొత్తాన్ని ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ విధానంలో చెల్లించవచ్చు.

ఏదేని మొబైల్ 30 రోజుల్లోపు కిందపడి

సంగీత మొబైల్‌స్టోర్లో కొన్న ఏదేని మొబైల్ 30 రోజుల్లోపు కిందపడి డ్యామేజ్ అయితే...ఆ మొబైల్‌ను తిరిగి వెనక్కి ఇచ్చి కొత్తఫోన్‌ను మీరు సగం ధరకే కొనుక్కోవచ్చు.

30 రోజుల్లో ఆ ఫోన్ ధర ఎంత తగ్గితే

ఇక సంస్థ ప్రైస్ ప్రొటెక్షన్ స్కీం ప్రకారం సంగీతలో కొత్త ఫోన్ కొన్నప్పుడు 30 రోజుల్లో ఆ ఫోన్ ధర ఎంత తగ్గితే అందుకు సమానమైన మొత్తాన్ని వినియోగదారుడికి అందజేస్తారు.

ఎనిమిది నెలల కాలంలో

ఇలా ఎనిమిది నెలల కాలంలో ఇప్పటి వరకూ వివిధ వినియోగదారులకు రూ.3,10,30,791 చెల్లించారని కంపెనీ ఎండీ చెబుతున్నారు.

సంగీత గోబిబోతో ప్రత్యేక ఒప్పందం

ఇప్పుడు సంగీత గోబిబోతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఆ సంస్థ నుంచి రూ.10 వేలు విలుచేసే గోక్యాష్‌ను పొందవచ్చు. ఈ గోక్యాష్ ద్వారా ఫ్లైట్, బస్సుతో పాటు హోటల్ రూంలో బిల్లులో ప్రతి సారి 40% డిస్కౌంట్ కూడా వస్తుంది. దీన్ని గోబిబోద్వారా మీరు పొందవచ్చు.

ఈజీ పే యాప్ ద్వారా

ఈజీ పే యాప్ ద్వారా వినియోగదారుడి పాత ఫోన్‌కు సరైన ధర నిర్ణయిస్తారు. వీటితో పాటు సంగీత మొబైల్‌లో ప్రతి ఫోన్ కొనుగోలుపై అష్యూర్డ్ గిఫ్ట్‌ను వినియోగదారుడు అందుకోవచ్చు.

300 స్టోర్లలో ఈ ఆఫర్లు

లెదర్‌పర్స్, ఫిట్‌నెస్‌బాండ్, పవర్‌బ్యాంక్ వస్తువులను అష్యూర్డ్ గిఫ్ట్ అందుతుంది. సంగీత సంస్థకు చెందిన 300 స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఐఫోన్-7పై 10వేల క్యాష్‌బ్యాక్

ఇంకా ఐఫోన్-7ను సిటీబ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసి రూ. 10వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే ఉంటుందని కంపెనీ చెబుతోంది. 

అర్ధరాత్రి 12 గంటల వరకూ

అక్టోబర్ 7న మార్కెట్‌లోకి రానున్న ఐఫోన్-7ను వినియోగదారులకు అందజేయడం కోసం ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకూ షోరూంలు తెరిచి ఉంటాయని కంపెనీ సైట్‌లో పొందుపరిచారు.

అన్ని వివరాలను

ఈ డీల్స్ కు సంబంధించిన అన్ని వివరాలను మీరు మీ దగ్గర్లోని సంగీత మొబైల్స్ షోరూంలో కెళ్లి కనుక్కోవచ్చు. వారే మీకు అన్ని వివరాలు చెబుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Sangeetha Mobiles 2016 Festival Discount Offers List and Price read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot