ట్విస్టంటే ఇది, నోట్లరద్దుతో ఐఫోన్లు చిక్కడం లేదు

Written By:

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం నల్లధనాధిపతులను వణికిస్తుంటే కొన్ని కంపెనీలకు మాత్రం పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా దిగ్గజ సంస్థ ఆపిల్ కంపెనీకి ఈ అవకాశం బాగా కలిసివస్తోంది. ఇండియాలో విక్రయాలు పెంచుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్న కంపెనీ డీమానిటైజేషన్ దెబ్బకి భారీ లాభాలతో దూసుకుపోతోంది. అనూహ్యంగా పెరిగిన లాభాలతో ఆపిల్ తన మిలియన్ ఐఫోన్ మార్క్ ని దాటేలా కనిపిస్తోంది.

కొత్తగా 35 లక్షల ఐటీ ఉద్యోగాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు రోజుల్లో

డీమానిటైజేషన్ దెబ్బకి కేవలం మూడు రోజుల్లో ఆపిల్ కంపెనీ లక్ష ఖరీదైన ఐ ఫోన్లను అమ్మినట్టు తెలుస్తోంది. ఇది నెల వారీ అమ్మకాల సగటులో నాలుగు రెట్లు అధికమని ట్రేడ్ పండితులు చెపుతున్నారు.

గడిచిపోయిన తేదీ రసీదులతో

పెద్ద నోట్ల రద్దు తర్వాత గడిచిపోయిన తేదీ రసీదులతో ఐఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఆశ్చర్యకర అంశం ఏంటంటే ప్రీమియం ధర కన్నా ఎక్కువకే ఈ ఫోన్లను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డీమానిటైజేషన్ దెబ్బకి

దేశీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ విక్రయాలు డీమానిటైజేషన్ దెబ్బకి భారీగా పడిపోయిన నేపథ్యంలో ఐఫోన్ అమ్మకాలు ఊపందుకోవడం ట్రేడ్ పండితుకు ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. రద్దయిన నోట్లతో చాలామంది ఖరీదైన హ్యాండ్ సెట్లను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

అక్టోబర్ లో 4 లక్షల స్మార్ట్ ఫోన్లను

కౌంటర్ పాయింట్ ప్రకారం, ఆపిల్ అక్టోబర్ లో 4 లక్షల స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేసింది. ఇది నవంబర్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆపిల్ ఇండియా మార్కెట్ లో మిలియన్ ఐఫోన్ల సేల్ టార్గెట్ కు చేరువలో ఉండటం ఖాయం.

భారతదేశ మార్కెట్లో డిమాండ్

ఇక రూ 60,000, రూ 92,000 కు ధర పలికే ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లకు భారతదేశ మార్కెట్లో డిమాండ్ బాగా ఉందని సంగీత మొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర కూడా తెలిపారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple sales shoot up as customers rush to buy iPhones with demonetised notes Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting