కొత్తగా 35 లక్షల ఐటీ ఉద్యోగాలు

Written By:

సాఫ్ట్ వేర్ రంగంలో జాబును సంపాదించాలనుకునేవారికి శుభవార్త. ఈ రంగాన్ని ముందు ముందు అత్యాధునికంగా తయారుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ విధాన ముసాయిదాను విడుదల చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా సాప్ట్‌వేర్ రంగానికి ముసాయిదాను విడుదల చేయడం ఇదేతొలిసారి. ఈ ముసాయిదా ప్రకారం 2025 నాటికి కొత్తగా 35 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను సృష్టించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనుంది.

ఫ్లిప్‌కార్ట్ దిమ్మతిరిగే షాక్ తగిలింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐటీ పరిశ్రమ

దేశంలో ఇప్పటివరకు ఐటీ పరిశ్రమ 143 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినప్పటికీ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విభాగంలో ఆదాయం 6.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. పైగా ఇందులో దాదాపు 2 బలియన్ల డాలర్లు ెగుమతుల నుంచే వస్తున్నాయి.

ముసాయిదా కమిటీ ప్లాన్

ప్రపంచ మార్కెట్లోకి మన దేశ ఉత్పత్తుల వాటాను 10 రెట్లు పెంచి దాదాపు 10 లక్షల కోట్ల విభాగంగా దేశీయ మార్కెట్ ని తీర్చిదిద్దాలనన్నది ముసాయిదా కమిటీ ప్లాన్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐటీ ఉత్పత్తుల అభివృద్ధిపై

ప్రస్తుతం ఉన్న 411 బిలియన్ డాలర్ల (దాదాపు రూ .28 లక్షల కోట్ల) ఉత్పత్తులను 2025 నాటికి లక్ష కోట్ల డాలర్ల (రూ .68 లక్షల కోట్ల)కు చేర్చాలనే ధ్యేయంగా ఈ ప్రణాళిక పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.

2025 నాటికి

2025 నాటికి దేశీయ ఐటీ పరిశ్రమ 350 బిలియన్ డాలర్ల (రూ .23.80 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుందన్నది నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) అంచనా.

సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచే చర్యలు

ఇందులో భాగంగా ప్రభుత్వం రక్షణ, అణు ఇంధన, అంతరిక్ష, విమానయానం, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, విద్యుత్తు, ఆర్యోగ సంరక్షణ రంగాల్లో సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచే చర్యలు తీసుకుంటామని, ప్రోత్సహిస్తామని తెలిపింది.

2025 నాటికి 10 లక్షల మంది నిపుణులను

అత్యున్నత సాఫ్ట్వేర్ ఉత్పత్తుల అభివృద్ధి కోసం 2025 నాటికి 10 లక్షల మంది నిపుణులను సిద్ధం చేసే ప్రక్రియ చేపట్టాలని సాఫ్ట్వేర్ విధాన ముసాయిదా సూచించింది. 

దేశంలో కొత్తగా 10,000 స్టార్టప్స్

ప్రపంచ మార్కెట్లో పోటీపడే సత్తా కలిగిన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల అభివృద్ధి కోసం దేశంలో కొత్తగా 10,000 స్టార్టప్స్ ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలనేది ముసాయిదా లక్ష్యం.

2025 నాటికి మరో 25 లక్షల ఉద్యోగాలు

ఇవి సాకారమైతే కొత్తగా మరో 35 లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించగలదని అంచనా. 2017 కు 10 లక్షల ఉద్యోగాలు, 2025 నాటికి మరో 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ముసాయిదా ఆకాంక్ష.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Govt unveils National Software Policy, eyes 3.5 mn jobs by 2025 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot