అత్యంత చవక ధరలకే ఐఫోన్లు

Written By:

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ మరోసారి సెకండ్ హ్యాండ్ ఆపిల్ ఫోన్ల విక్రయాలకు తెరలేపింది. ఈ మేరకు ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రీఫర్బిష్డ్ ఫోన్లను తమ అధికారికి వెబ్ సైట్ లో విక్రయానికి ఉంచామని కావలసిన వారు కొనుగోలు చేయవచ్చని అధికారికంగా ప్రకటించింది.అయితే ఇది యూఎస్ లో మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. త్వరలో ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. 

కష్టమర్ల కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ కీలక నిర్ణయం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

15 శాతం డిస్కౌంట్

కొత్త మోడల్స్‌తో పోలిస్తే వీటిపై 15 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అన్‌లాక్ చేసిన, పునరుద్ధరించిన 6 ఎస్, 6 ఎస్ ప్లస్ లాంటి ఐఫోన్లను ఈ తగ్గింపు ధరల్లో కష్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది.

రూ .39 వేలు

ఇక ఆపిల్ వెబ్‌సైట్‌ అందించిన వివరాల ప్రకారం గోల్డ్ కలర్ 64 జీబీ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ ఐఫోన్‌ను సుమారు రూ .39 వేలకు ($ 589 డాలర్లు) కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిల్వర్ కలర్ 16GB 6 ఎస్ ప్లస్

సిల్వర్ కలర్ 16GB 6 ఎస్ ప్లస్ ఐఫోన్ రూ .35 వేలకు ($ 529) అందుబాటులో ఉంది.

కొత్త బ్యాటరీ, కొత్త ఔటర్ షెల్

కొత్త బ్యాటరీ, కొత్త ఔటర్ షెల్ అమర్చి పునరుద్ధరించిన ఈ ఆపిల్ ఫోన్లకు ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.

2007 లో చివరిసారిగా

కాగా ఆపిల్ గతంలో సెకండ్ హ్యాండ్ మ్యాక్లు, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లాంటి ఇతర ఆపిల్ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం తెలిసిందే. ఇలా 2007 లో చివరిసారిగా తన ఉత్పత్తులను విక్రయించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Apple selling refurbished unlocked 16GB iPhone 6S Plus in online stores read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot