కష్టమర్ల కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ కీలక నిర్ణయం

Written By:

భారత ప్రధాని నరేంద్ర మోడీ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్య ప్రజలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. చిల్లర కోసం కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించాలన్నా చాలామంది తటపటాయిస్తుంటారు. పెనాల్టి పడుతుందని మరోవైపు దిగులు చెందుతుంటారు.ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

సంచలనం రేపుతున్న బిఎస్ఎన్ఎల్ రూ. 49 ఆఫర్

కష్టమర్ల కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ కీలక నిర్ణయం

తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు బిల్లులు చెల్లించే గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించింది. బ్యాంకులు, ఏటీఎంల సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో రెండు కంపెనీలు తమ వినియోగదారులకు ఈ వెసులుబాటును కల్పించాయి. పెనాల్టీ లేకుండా, నవంబర్ 15 వరకూ బిల్లులు చెల్లించొచ్చని రెండు కంపెనీలు పేర్కొన్నాయి. ఈ మేరకు రెండు కంపెనీలు తమ వినియోగదారులకు సందేశాన్ని పంపించనున్నాయి.

ఆర్‌బిఐ సర్వర్ డౌన్, నోట్లను మార్చుకునే మార్గాలు !

ఎయిర్‌టెల్ యూజర్లు తమ పాత సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకున్నట్లయితే 2జీబి 4జీ డేటా ఉచితంగా పొందవచ్చు. ఎలాగో చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీరు ఇప్పటికే వాడుతోన్న 2జీ/3జీ ఎయిర్‌టెల్ సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకునే క్రమంలో http://www.airtel.in/4g/sim-swapలోకి వెళ్లి.. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇంకా షిప్పింగ్ అడ్రస్ వివరాలను ఎంటర్ చేసి 'Send me a 4G SIM'పై క్లిక్ చేయండి.

 

 

స్టెప్ 2

మీరు తెలిపిన వివరాలు ప్రకారం ఎయిర్‌టెల్ 4జీ సిమ్ మీ చిరునామాకు డెలివరీ చేయటం జరుగుతుంది. కొత్త సిమ్ పొందిన తరువాత ఆ సిమ్ పై ఉన్న 20 డిజిట్ల నెంబర్‌ను 121కు ఎస్ఎంఎస్ చేయవల్సి ఉంటుంది.

 

 

స్టెప్ 3

మెసెజ్ పంపిన వెంటనే ఎయిర్‌టెల్ నుంచి మీకో రిప్లై మెసేజ్ అందుతుంది. ఆ మెసేజ్‌ను కన్ఫర్మ్ చేసేందుకు ‘1' అంకెను ప్రెస్ చేయవల్సి ఉంటుంది.

 

 

స్టెప్ 4

ఈ ప్రక్రియ పూర్తి అయిన కొద్ది నిమిషాలకే మీ పాత ఎయిర్‌టెల్ సిమ్ డిస్‌కనెక్ట్ కాబడుతుంది. ఇలా జరిగిన వెంటనే కొత్త ఎయిర్‌టెల్ సిమ్‌ను ఫోన్‌లో ఇన్సర్ట్ చేసి ఎయిర్‌టెల్ 4జీ సేవలను ఆస్వాదించవచ్చు.

స్టెప్ 5

సిమ్ అప్‌గ్రేడ్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మీ నెంబర్‌కు 2జీబి 4జీ డేటా క్రెడిట్ అవుతుంది. ఉచిత 4జీ డేటాను పొందే క్రమంలో 52122 నెంబర్‌కు మిస్సుడ్ కాల్ ఇవ్వవల్సి ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 English summary
Airtel, Vodafone extend deadline for bill payment by three days read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting