భారీగా తగ్గిన అసుస్ జెన్‌ఫోన్ల ధరలు

Written By:

తైవనీస్ హ్యండ్ సెట్ తయారీ దిగ్గజం అసుస్ తన జెన్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. జెన్ ఫోన్ 3(జెడ్ఈ552కేఎ ల్), జెన్ ఫోన్ 3(జెడ్520కేఎల్ స్మార్ట్ ఫోన్ల ధరలను దాదాపు రూ. 8వేల వరకు తగ్గిస్తున్నామని కంపెనీ తెలిపింది. తగ్గిన ఫోన్ల ధరలు కింది విధంగా ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జెన్ ఫోన్3(జెడ్ఈ552కేఎల్)

ఆసుస్ జెన్ ఫోన్3(జెడ్ఈ552కేఎల్) స్మార్ట్ ఫోన్ లాంచింగ్ సమయంలో రూ. 27,999 వేలు ఉండగా.. ప్రస్తుతం ఈ ఫోన్ ను రూ. 19,999 వేలకే అందుబాటులో ఉంచింది. అంటే ఈ ఫోన్ 8వేల రూపాయల ధర తగ్గింది.

జెన్ ఫోన్ 3(జెడ్520కేఎల్)

జెన్ ఫోన్ 3(జెడ్520కేఎల్) స్మార్ట్ ఫోన్ పై కూడా 8వేల రూపాయల ధర కోత పెట్టి, 17,999 రూపాయలకే విక్రయానికి తీసుకొచ్చింది. ఈ ఫోన్ అసలు ధర 21,999 రూపాయలుగా ఉంది.

కంపెనీ ఎక్స్ క్లూజివ్ స్టోర్లలో

ఆసుస్ జెన్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్లు కంపెనీ ఎక్స్ క్లూజివ్ స్టోర్లలో అందుబాటులో ఉండనున్నాయి. వాటితో పాటు లీడింగ్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ వెబ్ సైట్లలో వీటిని తగ్గింపు ధరలకు కంపెనీ విక్రయానికి పెట్టనుంది.

కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతున్న తరుణంలో

జెన్ ఫోన్ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతున్న తరుణంలో ఈ ఫోన్లపై ధరను తగ్గించినట్టు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఆసుస్ జెన్ ఫోన్ 3(జెడ్520కేఎల్)కు 5.2 అంగుళాల డిస్ ప్లే, 3 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

4జీబీ ర్యామ్

ఆసుస్ జెన్ ఫోన్ 3(జెడ్ఈ552కేఎల్) 5.5 అంగుళాల డిస్ ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. మిగతా ఫీచర్లు ఈ రెండు ఫోన్లలో సమానంగా ఉన్నాయి.

అదనపు ఫీచర్లు

2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెస్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 ఎంపీ రియర్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 2టీబీ వరకు విస్తరణ మెమరీ అదనపు ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus ZenFone 3 smartphones get a significant price cut in India read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot