స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్లు !

Written By:

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై సరికొత్త ఆఫర్లను ప్రకటించేందుకు సిద్దమైంది. ఎలాగేనా విక్రయాలను పెంచుకుని అమెజాన్ కు పోటీనివ్వాలని అనుకుంటున్న ఫ్లిప్‌కార్ట్, 'బై బ్యాక్ గ్యారెంటీ' ప్రొగ్రామ్ తో వినియోగదారుల ముందుకు వస్తోంది. బిగ్ 10 సేల్ లో భాగంగా దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై ఈ ప్రొగ్రామ్ లాంచ్ చేయాలని ఫ్లిప్ కార్ట్ నిర్ణయించింది. మోటో జీ5 స్మార్ట్ ఫోన్ పై ఈ ప్రొగ్రామ్ ను మార్చిలో ఈ ఆన్ లైన్ రీటైలర్ తీసుకొచ్చింది. ఇది విజయవంతం కావడంతో మరోసారి దీన్ని లాంచ్ చేయనుందని కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు.

షియోమికి దిమ్మతిరిగేలా మోటో కొత్త ఫోన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విక్రయాలను 50-70 శాతం

ఇలాంటి ప్రొగ్రామ్ తో పాటు, తక్కువ ధరతో ఈఎంఐ, ఇతర ప్రొగ్రామ్స్ కూడా సాధారణంగా విక్రయాలను 50-70 శాతం పెంచుతాయని ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్స్ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్ రాజగోపాల్ చెప్పారు.

సేల్ సమయంలో

సేల్ సమయంలో రెండితలు, రెండింతలకు పైగా పెరుగుదల నమోదవుతుందని, బై బ్యాక్ గ్యారెంటీ అనేది ఫోన్ కు ఇన్సూరెన్స్ కవర్ కొనడం లాంటిదని అభివర్ణించారు.

రూ.10,000 నుంచి రూ.80,000 మధ్యలో

ఈ సేల్ సమయంలో రూ.10,000 నుంచి రూ.80,000 మధ్యలో ఉండే కనీసం సగం స్మార్ట్ ఫోన్ మోడల్స్ పై బై బ్యాక్ ను ఆఫర్ చేస్తామని ఆయన తెలిపారు.

ఎంఆర్పీపై 35-50 శాతం

ఆరు లేదా ఎనిమిది నెలల్లో కొత్త స్మార్ట్ ఫోన్ కోసం, కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ ను తిరిగి ఇచ్చేసినా, ఎక్స్చేంజ్ చేసుకున్నా ఎంఆర్పీపై 35-50 శాతం మధ్యలో కస్టమర్లకు ఆఫర్ చేస్తామని, అది బైబ్యాక్ గ్యారెంటీ నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, లెనోవో

ఇలాంటి ప్రొగ్రామ్ ప్రస్తుతం భారత్ లో లేదని, ఐఫోన్ లాంటి ధర ఎక్కువ కలిగిన స్మార్ట్ ఫోన్లపైననే అమెరికాలో ఇలాంటి ప్రొగ్రామ్ ఉందని రాజగోపాల్ వివరించారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ 10 సేల్ కింద ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, లెనోవో లాంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart will offer ‘Buyback Guarantee’ for smartphones during its upcoming Big 10 sales read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot