స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.... బీ కేర్ పుల్

Posted By:

ఈ రోజుల్లో అన్నం తినకుండా ఉండగలరేమో కాని జేబులో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేరన్నది బహిరంగ సత్యం. తమకున్న బడ్జెట్లలో ఏదో ఒక స్మార్ట్ పోన్ కొనుక్కోవాలని అందరూ ఆశపడుతుంటారు. అయితే

  read more మొత్తం చూస్తే.. షాకవుతారు!!

స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.... బీ కేర్ పుల్

స్మార్ట్ పోన్ కొనాలనుకున్న వారు ఒకసారి ఈ అంశాలను పరిశీలించండి.

1. ఫోన్ లో ఫీచర్స్ ని ఒకటికి రెండు సార్లు పరిశీలించండి. కష్టమర్లను మెప్పించడానికి వారు ఉన్నవి లేనివి చెబుతుంటారు..సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 inch మెగా పిక్షల్ అని చెబుతారు

కాని అందులో రిజల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది.అలాగే 4 జీబి అని చెబుతారు కాని 2 జీబి మాత్రమే ఉంటుంది. ఈ విషయాలు చాలా జాగ్ర్తత్తగా గమనించాలి

2. ఫోన్ల విషయంలో హర్డ్ వేర్ కు సంబంధించి తగు జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ లో ఎక్కువగా సమస్యలు వచ్చేది హర్డ్ వేర్ తోనే. అది చెడిపోతే వస్తువులు సాధారణంగా దొరకవు. అందుకుని ఫోన్ కొనే ముందు డెమో ఫోన్ ని ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తే మంచిది.

స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.... బీ కేర్ పుల్

3. మాములు ఫోన్ల కన్నా స్మార్ట్ ఫోన్లు చాలా ఖరీదయినవిగా చెబుతుంటారు. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తగ్గ బడ్జెట్ లోనే స్మార్ట్ పోన్ కొనుక్కోవడం చాలా మంచిది. అన్ని క్వాలిటీలు ఉన్నాయా లేవా అన్నది పరిశీలించాలి.

4. ఆపరేటింగ్ సిస్టమ్ పని చేస్తుందా లేదా అన్నది బాగా పరిశీలించాలి. అది ఆండ్రాయిడ్ వర్షనా లేక విండోస్ వర్షనా అన్నది సరి చూసుకోవాలి. ర్యామ్ రెండు వర్షన్లలో ఢిపరెంట్ గా పనిచేస్తుంది. మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేసే సమయంలో అవి సరిగా పని చేయవు. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి.

5. చివరిగా మీరు కొన్న ఫోన్ సమస్యలు వస్తే రిపేరింగ్ కు ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలుసుకోండి. వారంటీ సమస్యల గురించి అడగడం మరచిపోవద్దు. ప్రతి కంపెనీ తన స్మార్ట్ ఫోన్ కు వారంటీ అందిస్తోంది.

ఇప్పటికే చాలా కంపెనీల ముబైల్స్ స్పేర్ పార్ట్స్ మార్కెట్లో దొరకడం లేదు. వాటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి.
సో మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే షో రూంకి వెళ్లి మీరు కొనే ఫోన్ లో ఇవన్నీ ఉన్నాయా లేవా అన్నది తెలుసుకుంటే చాలు.అదిరిపోయే స్మార్ట్ ఫోన్ మీ సొంతం అవుతుంది.

English summary
If you are about to purchase a Smartphone then take into consideration these things before buying one.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot