ఐ ఫోన్ 7 ప్లస్ : 256 జిబితో పాటు అతి పెద్ద బ్యాటరీ

Written By:

ఆపిల్ సంస్థ త్వరలోతీసుకురానున్న ఐ పోన్ 7 ప్లస్ లో అతి పెద్ద బ్యాటరీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ సామర్ధ్యం వీలైనంత ఎక్కువగా ఉండేలా గట్టి చర్యలు తీసుకోనున్నట్లు చైనీస్ వెబ్ సైట్ వెల్లడించింది. అంతేకాకుండా 256జిబి సామర్ధ్యంతో ఐ ఫోన్ బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా అనేక రకాల హంగులతో ఐ ఫోన్ 7 ప్లస్ అతి త్వరలోనే మార్కెట్లో కనువిందు చేయనుంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : ఐ ఫోన్ 7: నీటితో చెలగాటం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ సంస్థ త్వరలో తీసుకురానున్న

యాపిల్ సంస్థ త్వరలో తీసుకురానున్న ఐఫోన్ 7 ప్లస్ లో బ్యాటరీ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. గత మోడళ్ల కన్నా ఐఫోన్ 7 ప్లస్ లో బ్యాటరీ బ్యాకప్ 12.5 శాతం వరకు పెరిగే అవకాశముందని చైనీస్ వెబ్‌సైట్ 'మైడ్రైవర్స్' వెల్లడించింది.

పెద్ద బ్యాటరీతోపాటు అదనంగా 256 జీబీ సామర్థ్యంతో

పెద్ద బ్యాటరీతోపాటు అదనంగా 256 జీబీ సామర్థ్యంతో ఈ మోడల్ ను విడదల చేయాలని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఐఫోన్ బ్యాటరీ బ్యాకప్ విషయమై వినియోగదారుల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మేరకు కీలక చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.

ఐఫోన్ 7 స్మాల్ మోడల్ కు ప్రత్యామ్నాయంగా

ఐఫోన్ 7 స్మాల్ మోడల్ కు ప్రత్యామ్నాయంగా వస్తున్న 7 ప్లస్ మోడల్ లో బ్యాటరీ బ్యాకప్ పెరగడంతోపాటు ఇంటర్నల్ స్టోరేజి 256 జీబీకి పెరుగనుంది. ప్రస్తుతమున్న 6, 6 ఎస్ 6 ప్లస్ మోడళ్ల మాదిరిగానే ఐఫోన్ 7 ప్లస్ లోనూ పెద్ద తెర, కెమెరా సాంకేతికత హంగులు ఉండనున్నాయి.

ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారుల నుంచి ప్రధానంగా

ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారుల నుంచి ప్రధానంగా వస్తున్న ఫిర్యాదు ఫోన్ బ్యాటరీ బ్యాకప్ గురించే. బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో త్వరగా చార్జింగ్ అయిపోతున్నదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రివియస్ మోడళ్ల కన్నా ఐఫోన్ 7 ప్లస్ లో

ఈ నేపథ్యంలో ప్రివియస్ మోడళ్ల కన్నా ఐఫోన్ 7 ప్లస్ లో బ్యాటరీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాలని యాపిల్ భావిస్తోంది.

రాబోయే హ్యాండ్ సెట్ త్రీ డీ టచ్ స్క్రీన్ కు

స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్న ఐ ఫోన్ రాబోయే హ్యాండ్ సెట్ త్రీ డీ టచ్ స్క్రీన్ కు ఇంతకు ముందు ఎక్కడా లేని .. ఓ స్రాంప్రదాయమైన హోం బటన్ ను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు డిజైనర్ మార్కర్ వీడ్ లిచ్ చెప్తున్నారు.

ఫోన్ ను సింగిల్ స్క్రీన్ లోకి మారిస్తే

ఫోన్ ను సింగిల్ స్క్రీన్ లోకి మారిస్తే సులభతరం అవుతుందన్న విషయంపై దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. తాను యాపిల్ కోసం సింపుల్ డిజైన్ లాంగ్వేజ్ ను రూపొందించనున్నట్లు తెలిపాడు.

హ్యాండ్ సెట్ ను పట్టుకునేందుకు వీలుగా ఉండేట్టు

హ్యాండ్ సెట్ ను పట్టుకునేందుకు వీలుగా ఉండేట్టు వెనుక బాడీని అల్యూమినియం తో రూపొందించి దానికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ను కూడ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు డిజైనర్ చెప్తున్నారు. ఈ ప్లాస్టిక్ స్ట్రిప్ వినియోగదారులను ఆకట్టుకునే వివిధ రంగుల్లో, డిజైన్లలో ఉండేట్లు రూపొందిస్తున్నారు.

దీంతో రాబోయే యాపిల్ ఐ ఫోన్ డిజైన్ పూర్తి భిన్నంగా

దీంతో రాబోయే యాపిల్ ఐ ఫోన్ డిజైన్ పూర్తి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒక్క డిజైన్ మాత్రమే కాక ఇంతకు ముందుకంటే బ్యాటరీ బ్యాక్ అప్ రెట్టుంపు ఉండేట్టు మ్యాక్ బుక్ లైనప్ ను ప్రయోగిస్తున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write iPhone 7 Plus could have much larger battery than predecessors, reports say
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot