స్పెసిఫికేషన్ పరంగా ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

Written By:

ఈ ఏడాది స్పెసిఫికేషన్స్ పరంగా మార్కెట్లో దుమ్మురేపిన ఫోన్లు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే అవి ఎందులో బెస్ట్ గా నిలిచాయి. ఏ ఫీచర్ తో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాయి లాంటి విషయాలను నిపుణులు వెల్లడించారు. మొత్తంగా ఈ ఏడాది స్పెషిఫికేషన్ పరంగా 2016లో బెస్ట్ గా నిలిచిన ఫోన్లపై మీరే ఓ లుక్కేయండి.

బేసిక్ ఫోన్‌తో బ్యాంకు సేవలు పొందడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ 7 ప్లస్

ఈ ఏడాది బెస్ట్ ఫోన్లలో ఆపిల్ 7 ప్లస్ నంబర్ స్థానాన్ని ఆక్రమించింది. మంచి స్మార్ట్‌ఫోన్ కావాలనుకున్న వారు ఆపిల్ 7 ప్లస్ ను ఎంచుకోవచ్చని వారు చెబుతున్నారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్, వైడ్ యాంగిల్, టెలిఫోన్ లెన్స్ కాంబినేషన్ తొలి డ్యుయల్ ఫ్రంట్ కెమెరా తదితర సౌకర్యాలు ఈ ఫోన్ ను నెంబర్ వన్ గా నిలబెట్టాయని తెలిపారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్

దీని తరువాతి స్థానంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ నిలిచింది. ఇందులో సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ తో పాటు, ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సల్ కెమెరా ఉండడం కలిసివచ్చింది.

గూగుల్ పిక్సల్ ఫోన్

దాని తరువాతి స్థానంలో గూగుల్ పిక్సల్ ఫోన్ నిలిచింది. తొలిసారి గూగుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చినప్పటికీ యాపిల్, శాంసగ్ హైఎండ్ ఫోన్లకు పోటీ ఇవ్వడం విశేషం.

వన్ ప్లస్ 3

దాని తరువాతి స్థానంలో వన్ ప్లస్ 3 స్మార్ట్ ఫోన్ వుంది. స్మార్ట్ ఫీచర్స్ తో అందుబాటు ధరల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రావడంతో ఈ జాబితాలో స్థానం సంపాదించుకుంది.

మోటో జెడ్

దాని తరువాతి స్థానంలో మోటో జెడ్ నిలిచింది. ఇవి బ్యాటరీ మన్నికలో కాని ధరలో కాని ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.

నుబియా జెడ్ 11

ది మోస్ట్ స్టైలిష్ ఫోన్ గా నూబియా జడ్ 11 నిలిచింది. బీజిల్ లెస్ డిజైన్ తో వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇండియా మార్కెట్లోకి గత వారమే ప్రవేశించింది. కెమెరా విషయంలో వన్ ప్లస్ 3కి పోటిగా నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Best smartphones for 2016: Apple iPhone 7, S7 edge, Google Pixel, OnePlus 3 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot