సామ్‌సంగ్ న్యూస్: కొరియాలో కొత్తగా ‘రెండు’

Posted By: Super

సామ్‌సంగ్ న్యూస్: కొరియాలో కొత్తగా ‘రెండు’

 

సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి రెండు కొత్త కలర్ వర్షన్‌లను కొరియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. దింతో సఫైర్ బ్లాక్ ఇంకా గార్నెట్ రెడ్ కలర్ వేరియంట్‌లు కొత్తగా జతయ్యాయి. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్3 మార్బుల్ వైట్, పెబ్బిల్ బ్లూ కలర్ వేరియంట్ లలో లభ్యమవుతున్న విషయం తెలిసిందే. గార్నెట్ రెడ్ వర్సన్ ఆర్డర్ పై లభ్యమవుతోంది. కొరియన్ మార్కెట్లో గత సెప్టంబర్‌లో ఆవిష్కరించిన మరో కలర్ వేరియంట్ మార్టియన్ పింక్ గెలాక్సీ ఎస్3ని 16జీబి వర్షన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు సామ్‌సంగ్ పేర్కొంది.

లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ (రూ.4,000 నుంచి)

సామ్‌సంగ్ న్యూస్: కొరియాలో కొత్తగా ‘రెండు’

గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. తగ్గింపు ధరల్లో భాగంగా గెలాక్సీ ఎస్3 తాజా ధర రూ.31,900కు లభ్యమవుతోంది (పాత ధర రూ.34,900).

జనవరి ఫస్ట్ వీక్ రిలీజ్‌లు (స్మార్ట్‌‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot