బ్లాక్‌బెర్రీ నుంచి 4జిబి ర్యామ్‌తో సెకండ్ ఆండ్రాయిడ్ ఫోన్
బ్లాక్‌బెర్రీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ KEYoneని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన రెండో ఆండ్రాయిడ్ ఫోన్ ని కూడా లాంచ్ చేసింది.
బ్లాక్‌బెర్రీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ KEYoneని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన రెండో ఆండ్రాయిడ్ ఫోన్ ని కూడా లాంచ్ చేసింది. అరోరా పేరుతో ఈ ఫోన్ ని ఇండోనేషియా మార్కెట్‌లో విడుదల చేసింది. అతి త్వరలో ఈ ఫోన్ భారత్‌లోనూ విడుదల కానుంది. రూ.17,476 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. మరి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ స్మార్ట్ లుక్కేయండి.
భార్యని అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నారా, టెకీలకు ఇకపై నో ఛాన్స్ !

డిస్‌ప్లే
5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో ఫోన్ వచ్చింది., 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ మీద ఆపరేట్ అవుతుంది

4 జీబీ ర్యామ్
4 జీబీ ర్యామ్ ని ఈ ఫోన్ లో పొందుపరిచారు. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కూడా ఉంది.

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా
కెమెరా విషయానికొస్తే 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో నచ్చిన విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. సెల్పీ అభిమానుల కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

అదనపు ఆకర్షణలు
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి అదనపు ఆకర్షణలు

ధర రూ.17,476
అతి త్వరలో ఇండియాకి వచ్చే అవకాశం, ఇండియాలో దీని ధర రూ.17,476గా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








