కొత్త ఫోన్లతో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన బ్లాక్‌బెర్రీ

Written By:

కెనడాకు చెందిన ఫోన్ దిగ్గజం బ్లాక్ బెర్రీ ఎట్టకేలకు మార్కెట్లోకి తన కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా ఓఎస్ ల మీద ఫోన్లను రిలీజ్ చేసిన బ్లాక్ బెర్రీ ఇప్పుడు తన నూతన ఫోన్లను ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లగా మార్కెట్ లోకి తీసుకొస్తోంది. అయితే ఈ ఫోన్లు చివరివా లేక కంపెనీ ఇంకా ఫోన్లను తీసుకొస్తుందా అన్నదానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. లాంచ్ అయిన ఫోన్ ఫీచర్లేంటో ఓ సారి చూద్దాం.

జియోకు అదిరే షాక్..లైఫ్ ఫోన్లు పేలిపోతున్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

DTEK60 ఫీచర్లు

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 2TB

 

 

DTEK60 ఫీచర్లు

డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ లో ఏర్పాటు చేసిన 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను షూట్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో పొందుపరిచిన 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

 

 

DTEK60 ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు.. 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థను ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

DTEK60 ఫీచర్లు

సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ.. సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ డిజైన్ చేయబడిన ఈ ఫోన్‌లో ‘DTEK by BlackBerry' పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసారు. ఈ యాప్.. ఫోన్‌లోని ఆపరేటింగ్ సిస్టంతో పాటు అన్ని విబాగాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ డేటాకు రక్షణ కల్పిస్తుంది.

 

 

ఆపిల్, సామ్‌సంగ్‌ల దెబ్బకు

ఆపిల్, సామ్‌సంగ్‌ల దెబ్బకు బ్లాక్‌బెర్రీ తన స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్‌ను కోల్పొయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన DTEK60 స్మార్ట్‌ఫోన్ అటు స్పెసిఫికేషన్స్ పరంగా, ఇటు ధర పరంగా ఐఫోన్ 7, గూగుల్ పిక్సల్ వంటి టాప్ ఎండ్ ఫోన్‌లకు పోటీగా నిలిచింది.

ఫోన్‌ల తయారీని పూర్తిగా నిలిపివేసి..

ఫోన్‌ల తయారీని పూర్తిగా నిలిపివేసి.. ఫేలవమైన అమ్మకాలతో నిర్వహణ వ్యయం పెరిగిపోతుండటతో స్మార్ట్‌ఫోన్‌ల తయారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బ్లాక్‌బెర్రీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మీదట సాఫ్ట్‌వేర్ బిజినెస్ అభివృద్థి పై దృష్టిపెడుతున్నట్లు బ్లాక్‌బెర్రీ తెలిపింది.

 

 

ధర

ఇక ధరల విషయానికొస్తే DTEK50 ధర రూ. 21, 990గా కంపెనీ నిర్ణయించింది. DTEK60 ధరను 46, 990గా నిర్ణయంచింది. 

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
BlackBerry DTEK50, DTEK60 Launched in India: Price, Release Date, Specifications, and More read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting