జియోకు అదిరే షాక్..లైఫ్ ఫోన్లు పేలిపోతున్నాయి

Written By:

ఇప్పటిదాకా ఫోన్ పేళుళ్లతో అల్లాడిన శాంసంగ్ కు తోడుగా రిలయన్స్ జియో కూడా చేరింది. సంస్థ తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన 4జీ లైఫ్ స్మార్ట్ ఫోన్లు పేలిపోతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. 4 జీ తరంగాలను ఉచితంగా అందిస్తూ, శరవేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియోకు నిజంగానే బ్రేకులు వేసే వార్త ఇదే అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. వివరాలు చూద్దాం.

ఇకపై జియో స్పీడ్ 400Mbps,లైవ్‌లోకి సిల్వర్,గోల్డ్,ప్లాటినం ప్లాన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తన్వీర్ సాదిక్ అనే నాయకుడు

జమ్ము కశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన తన్వీర్ సాదిక్ అనే నాయకుడు తన ఇంట్లో ఉన్న లైఫ్ ఫోన్ పేలిందని, తన కుటుంబ సభ్యులు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ట్వీట్ చేశారు.

జియో లైఫ్ ఫోన్ చిత్రాలను

తన కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని చెబుతూ, పేలిన రిలయన్స్ జియో లైఫ్ ఫోన్ చిత్రాలను ఆయన చూపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

దీనిపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించడంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మరింతగా దూసుకెళుతోంది. ఈ ఫోన్ వినియోగదారులంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

తాను మాత్రం ఆ ఫోన్ ఉపయోగించేది లేదని

అందరూ సురక్షితంగా ఉన్నందుకు ఆనందంగా ఉందని, చూడబోతుంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోందని .. ఇక మీదట తాను మాత్రం ఆ ఫోన్ ఉపయోగించేది లేదని ఒమర్ అబ్దుల్లా తన ట్వీట్లో పేర్కొన్నారు.

రిలయన్స్ లైఫ్ దీనిపై ఒక ప్రకటన

ఈ విషయం తెలిసిన కాసేపటికే రిలయన్స్ లైఫ్ దీనిపై ఒక ప్రకటన కూడా చేసింది. తమ ఫోన్లు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం డిజైన్ చేసి, ఉత్పత్తి చేసినవని .. ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీదారులే వీటిని రూపొందించారని అందులో తెలిపింది.

పూర్తిస్థాయి విచారణ

సోషల్ మీడియా ద్వారా తెలిసిన ఈ విషయం గురించి తాము సీరియస్గా తీసుకుంటున్నామని, ఫోన్ పేలడానికి కారణమేంటో అంచనా వేస్తున్నామని .. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Lyf smartphone 'explodes', firm investigating read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot