ఆండ్రాయిడ్ ఫోన్లకు బ్లాక్‌బెర్రీ సవాల్ !

Written By:

బ్లాక్ బెర్రీ ఈ మధ్య కాలంలో కనుమరుగైన పేరు,, స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఆండ్రాయిడ్స్ ఏలుతున్న తరుణంలో వాటితో పోటీపడలేక నోకియా , బ్లాక్ బెర్రీలాంటి కంపెనీలు తెరవెనక్కి వెళ్లిపోయాయి. పోయినచోటే వెతుక్కోవాలనే ఆలోచనతో సరికొత్తగా ఆండ్రాయిడ్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ బెర్రీ తన ఆండ్రాయిడ్ మెర్క్యురీ ఫోన్ త్వరలో మార్కెట్లోకి తీసుకువస్తోంది.

రూ. 149తో జియోకి షాకిస్తున్న బిఎస్ఎన్ఎల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టచ్ స్క్రీన్ తో పాటు క్వర్టీ కీ ప్యాడ్

ఈ ఫోన్ స్పెషల్ ఏంటంటే టచ్ స్క్రీన్ తో పాటు క్వర్టీ కీ ప్యాడ్'ను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ మేరకు గ్రీక్ బెంచ్ లో లీకయిన ఫోటోల ప్రకారం ఈ ఫోన్ 2GHz Octa-core Qualcomm processorతో రానున్నట్టు తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ పై పనిచేసే ఈ ఫోన్ గీక్ బెంచ్ లో అద్భుతమైన స్కోరును సాధించింది. సింగిల్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ లో 913 అలాగే మల్టీ కోర్ లో 5046 స్కోర్ సాధించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే

4.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, అడ్రినో 506 గ్రాఫిక్స్ తో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 3జిబి ర్యామ్ తో పాటు 32 జిబి లేకుంటే 62 జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలుస్తోంది. టచ్ డిష్ ప్లే తో రానున్న ఈ ఫోన్ లో 3,400 mAh బ్యాటరీని పొందుపరిచారు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 18 ఎంపీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ షూటర్ ఉన్నట్లు తెలుస్తోంది. 4 జీ ఎల్టీఈ, వైఫై డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2 అదనపు ఫీచర్లు. ధర ఇంకా నిర్ణయించలేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
BlackBerry Mercury: Leaked images reveal full QWERTY keyboard read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot