రూ. 149తో జియోకి షాకిస్తున్న బిఎస్ఎన్ఎల్

ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్లతో దూసుకుపోగా ఇప్పుడు ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ రూ. 149 అన్ లిమిటెడ్ అంటూ దూసుకొస్తోంది.

By Hazarath
|

మార్చి 31 2017 వరకు జియో ఉచితమంటూ ప్రకటించిన నేపథ్యంలో టెల్కోలు అన్నీ ఇప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో కష్టమర్లను ఆకట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా ప్రైవేట్, ప్రభుత్వ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయ. ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్లతో దూసుకుపోగా ఇప్పుడు ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ రూ. 149 అన్ లిమిటెడ్ అంటూ దూసుకొస్తోంది. జనవరి నుంచి ఈ అన్ లిమిటెడ్ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

రూపాయికే వన్‍ప్లస్ 3T స్మార్ట్‌ఫోన్ !

ఇతర ఫ్రీ ఆఫర్లతో కొత్త మంత్లీ ప్లాన్

ఇతర ఫ్రీ ఆఫర్లతో కొత్త మంత్లీ ప్లాన్

జియో తాజా ఆఫర్ కు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ చందాదారులకు నెలకు ఉచిత వాయిస్ కాల్స్, ఇతర ఫ్రీ ఆఫర్లతో కొత్త మంత్లీ ప్లాన్ ను పరిచయం చేయబోతోంది.

రూ .149 రీచార్జ్ తో

రూ .149 రీచార్జ్ తో

జనవరి 1 నుంచి ఈ బంపర్ ఆఫర్ ను వినియోగదారులకు అందించనుంది. నెలకు రూ .149 రీచార్జ్ తో ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ వాయిస్ కాల్స్ తోపాటు 300 ఎంబీ డాటా సదుపాయంతో ఈ ప్లాన్ ను లాంచ్ చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అపరిమిత వాయిస్ కాల్స్
 

అపరిమిత వాయిస్ కాల్స్

 నెల రూ 149తో భారతదేశం అంతటా ఏ నెట్వర్క్ వద్ద మొబైల్ చందాదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు.

వినియోగదారులను నిలబెట్టుకోవడంపై

వినియోగదారులను నిలబెట్టుకోవడంపై

జియో వ్యూహాత్మక ధరలు, ప్రధాన ప్రత్యర్థులు భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్ ఆఫర్ల నేపథ్యంలో కొత్త చందాదారులను ఆకట్టుకోవడంతోపాటు ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంపై దృష్టిపెట్టినట్టు ఆయన చెప్పారు.

ఆరు రెట్ల వృద్ధితో రూ. 3,855 కోట్ల నికర లాభాలు

ఆరు రెట్ల వృద్ధితో రూ. 3,855 కోట్ల నికర లాభాలు

కాగా 2015-16 సంవత్సరానికి గాను బీఎస్ఎన్ఎల్ సుమారు ఆరు రెట్ల వృద్ధితో రూ. 3,855 కోట్ల నికర లాభాలను ప్రకటించింది.

జియో 28 రోజుల వాలిడిటీతో

జియో 28 రోజుల వాలిడిటీతో

జియో 28 రోజుల వాలిడిటీతో, 300 ఎంబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్ లను రూ .149 రీచార్జ్ ప్లాన్ లో అందిస్తున్న సంగతి తెలిసిందే.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio effect: BSNL to launch free unlimited mobile calls plan at Rs 149 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X