లక్ష రూపాయల ఫోన్ ఇదే బాసూ...

Posted By:

లక్ష రూపాయల ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. కెనడాకు చెందిన ప్రముఖ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ బ్లాక్‌ బెర్రీ భారత మార్కెట్లోకి అత్యంత ఖరీదైన ‘పోర్ష్‌ డిజైన్‌ పి-9983 గ్రాఫైట్‌ స్మార్ట్‌ఫోన్‌'ను విడుదల చేసింది. దీని ధర రూ.99,990గా కంపెనీ ప్రకటించింది. అయితే స్థానిక పన్నులు కూడా కలుపుకుంటే దీని విక్రయ వ్యయం రూ.లక్ష దాటనుందట. ఈ కొత్త క్వెర్టీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది.
Read more : హ్యాకింగ్ తో దేశాలను హడలెత్తిస్తున్న ఐఎస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లక్ష ఫోన్ ఇదే బాసూ...

పోర్ష్‌, బ్లాక్‌బెర్రీ సంస్థలు కలిపి వినియోగదారుల ఉన్నత అభిరుచులకు తగ్గట్టుగా దీనిని రూపొందించారు. గత ఏడాది సంస్థ విడుదల చేసిన ఖరీదైన పోర్ష్‌ డిజైన్‌ పి 9983 స్మార్ట్‌ఫోన్‌కు ఇది ఆధునికీకరించిన మోడల్‌.

లక్ష ఫోన్ ఇదే బాసూ...

గ్రాఫైట్‌ మెటాలిక్‌ కలర్డ్‌ ఎలిమెంట్‌తో దీనిని రూపొందించారు. ఫోన్‌ వెనుక భాగంలో లెదర్‌ సంరక్షణ కవర్‌తో పాటుగా 330 పీపీఐ ఫిక్సల్‌ సామర్థ్యం కలిగిన 3.1 అంగుళాల తాకే తెర.

లక్ష ఫోన్ ఇదే బాసూ...

1.5 గిగా హెర్జ్‌ డ్యూయల్‌ కోర్‌ క్వాలీకామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఎస్‌4 (ఎంఎస్‌ఎం8960) ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇన్‌బిల్ట్‌ మెమోరీ, 2100 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

లక్ష ఫోన్ ఇదే బాసూ...

8 మెగాఫిక్సెల్‌ వెనుక కెమెరా, రెండు మెగా ఫిక్సెల్‌ ముందు కెమెరాతో పాటు బ్లాక్‌బెర్రీకే ప్రత్యేకంగా చెప్పబడే పిన్ ఫీచర్‌తో ఇది లభిస్తుంది.

లక్ష ఫోన్ ఇదే బాసూ...

అద్దంలా కనిపించే మన్నికైన కీబోర్డుతో పాటు సింథెటిక్‌ మెటీరియల్‌, గ్రాఫైట్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రంగు ఫ్రేమ్‌లో కొత్త ఫోన్‌ చూడగానే మనసు దోచేసేలా కంపెనీ తయారు చేసింది.

లక్ష ఫోన్ ఇదే బాసూ...

కీ బోర్డ్  మోడల్  ఇలా ఉంటుంది 

లక్ష ఫోన్ ఇదే బాసూ...

కీ బోర్డ్ టైప్ చేస్తుంటే చాలా స్మూత్ గా పదాలు అలా వచ్చేస్తుంటాయి.

లక్ష ఫోన్ ఇదే బాసూ...

ఇక ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాలు అయితే చెప్పనే అవసరం లేదు

లక్ష ఫోన్ ఇదే బాసూ...

అదిరిపోయే క్వాలిటీతో కంటికి కనిపించని ఇమేజ్ లను కూడా హెచ్ డీ క్వాలిటీతో తీయవచ్చు 

లక్ష ఫోన్ ఇదే బాసూ...

లుక్ చూడటానికి చాలా హుందాగా ఉంటుంది. ఖరీదైన ఫోన్ కావాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్ ఈ ఫోన్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Blackberry has launched its new Porsche Design P'9983 Graphite smartphone in India at a price of Rs 99,990. The smartphone is a variant of the Porshce Design P'9983 which was released last year and is the fourth release of the collaboration between Blackberry and Porsche Design.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot