హ్యాకింగ్ తో దేశాలను హడలెత్తిస్తున్న ఐఎస్

Posted By:

బుసలు కొడుతున్న తీవ్రవాదంతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఐఎస్ తీవ్రవాదులు ఇప్పడు లేటెస్ట్ టెక్నాలజీతో విలువైన సమాచారాన్ని హ్యాకింగ్ తో అన్ని దేశాలను హడలెతిస్తున్నారు. ఈ దేశం ఆ దేశం అని లేకుండా అన్నిదేశాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని వారు హ్యాక్ చేసి ఆ దేశాలకు సవాల్ విసురుతున్నారు. ఏయే దేశాలను టార్గెట్ చేశారు..ఎవరిని హతమారుస్తామని చెప్పారు. తెలుసుకోవాలంటే ఈ స్టోరి చదవాల్సిందే..

Read more:ఒబామా.. నీ సెల్ఫీ కేక మామా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశాల సీక్రెట్ పై కన్ను

ఇరాక్ ,సిరియాలో మారణహోమంతో రెచ్చిపోతున్న ఐఎస్ తీవ్రవాదల కన్ను ఇప్పడు దేశాల సీక్రెట్ పై పడింది.

హ్యకింగ్ తో బిజీ

రక్షణ రంగానికి అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా హ్యక్ చేస్తున్నారు.

విలువైన సమాచారం హ్యక్

అమెరికా, ఆస్ట్రేలియా ,యూరప్ వంటి దేశాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని ఐఎస్ హ్యక్ చేసింది .

హెచ్చరికలు జారీ

ఆ దేశాల్లో దాదాపు రక్షణరంగం అలాగే ప్రభుత్వ విభాగాల్లోని 1400 మంది ముఖ్యుల వివరాలను హ్యాక్ చేసినట్లు వెల్లడించింది. త్వరలో వీరందరినీ హతమారుస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన సీడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనే పత్రిక వ్యాసం ప్రచురించింది.

అమెరికా వారే ఎక్కువ

అయితే ఇందులో అమెరికాకు చెందిన వారే హిట్ లిస్ట్ లో అధికంగా ఉన్నారని ఆ పత్రిక వెల్లడించింది.

త్వరలో మట్టుబెడతామంటూ హెచ్చరికలు

మేం మీ కదలికలన్నీ గమనిస్తున్నాం మీరు వాడుతున్న సామాజిక మాధ్యమాల్లో మా సభ్యులున్నారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాం.ఇందులో మీ బంధువులు కూడా ఉన్నారు. త్వరలో మా ఐఎస్ మిత్రులు మిమ్మల్ని మీ దేశంలోనే మట్టుపెడతారు అని ఇస్లామిక్ స్టేట్ హ్యాకింగ్ విభాగం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

విక్టోరియా ఎంపీ టార్గెట్

అయితే ఇందులో ప్రధానంగా విక్టోరియా ఎంపీ ఉన్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులలకు ఈ విషయం చేరవేశానని ఆ ఎంపీ తెలిపారు.

రక్షణ కల్పించాలన్న ఎంపీ

అలాగే తమ కుటుంబ సభ్యులకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను కోరారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ విభాగం కూడా అంగీకరించింది.

ఆన్ లైన్ లో ఉద్యోగుల వివరాలు

ఉద్యోగుల వివరాలను,ఫోన్ నెంబర్లు,చిరునామాలతో సహా ఐఎస్ బుధవారం ఆన్ లైన్ పెట్టినట్లు తెలిపింది.

ఇస్లామిక్ రాజ్యమే లక్ష్యం

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ జెండానే ఎగరవేయడమే మా లక్ష్యమంటున్న ఐఎస్ తీవ్రవాదులు 

చిత్ర హింసలు

దొరికిన వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్న తీవ్ర వాదులు 

లేటెస్ట్ టెక్నాలజీ

విలువైన సమాచారం కోసం లేటెస్ట్ టెక్నాలజీతో రెచ్చిపోతున్న తీవ్ర వాదులు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A hacker group claiming Islamic State affiliation has released a video threatening “electronic war” against the US, Europe, and Australia. They say they’ve already hacked sites belonging to “American leadership," an Australian airport, and “others.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot