రూ. 5వేలకు అదిరే 4జీ ఫోన్లు, జియో సిమ్ ఫ్రీ

Written By:

హైదరాబాద్ సెల్‌కాన్ దిగ్గజం సెల్‌కాన్ తన కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. అత్యంత తక్కువ ధరల్లో లాంచ్ అయిన ఈ ఫోన్లకు కంపెనీ జియో సిమ్ ఫ్రీగా ఇవ్వనుంది. ఈ సంధర్భంగా కంపెనీ ఎండీ భారత ఫోన్ మార్కెట్ పై పలు విషయాలను చర్చించారు. భారత మార్కెట్లో కొత్త శకం ప్రారంమైందని చెబుతున్నారు. కంపెనీ విడుదల చేసిన రెండు ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

యూజర్లకు షాకిచ్చిన షియోమి, ఇండియా నుంచి అవుట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డైమండ్ సిరీస్‌లో ఏస్, పాప్

డైమండ్ సిరీస్‌లో ఏస్, పాప్ పేరుతో 4జీ వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్లను సెల్‌కాన్ విడుదల చేసింది. ఆండ్రాయిడ్ లాలీపాప్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్, 5 ఎంపీ కెమెరాను రెండు మోడళ్లలోనూ పొందుపరిచారు. డైమండ్ ఏస్‌ను 5 అంగుళాల డిస్‌ప్లే, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రూపొందించారు. దీని ధర రూ.4,999.

డైమండ్ పాప్‌

డైమండ్ పాప్‌ను 4.5 అంగుళాల స్క్రీన్‌తో తయారు చేశారు. ఫోన్ ధర రూ.4,699 ఉంది. స్క్రీన్ పగలకుండా ఉండేందుకు డ్రాగన్‌ట్రైల్ గ్లాస్‌ను వాడారు.మిగతా ఫీచర్లన్నీ ఓకటేనని చెప్పారు. అన్ని మోడళ్లకూ జియో వెల్కం ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు.

భారత కస్టమర్లు ప్రస్తుతం మేడిన్ ఇండియా ఫోన్ల వైపే

దీంతో పాటు భారత కస్టమర్లు ప్రస్తుతం మేడిన్ ఇండియా ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారని చైనా ఉత్పత్తుల పట్ల ద్వేషం పెంచుకుంటున్నారని ఇది హర్షించదగ్గ పరిణామమని సెల్‌కాన్ ఎండీ వై గురు తెలిపారు.

భారత్‌లో తయారైన ఫోన్ల కోసం పలు దేశాలు

దీంతో పాటు భారత్‌లో తయారైన ఫోన్ల కోసం పలు దేశాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయని, ఈయూ దేశాల కోసం ఒక ప్రముఖ విదేశీ టెలికం కంపెనీ నుంచి భారీ ఆర్డరును దక్కించుకున్నామని చెప్పారు. ఆ కంపెనీ కోసం 4జీ స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేస్తున్నట్టు ఆయన వివరించారు.

చైనా ఉత్పత్తుల విషయంలో

చైనా ఉత్పత్తుల విషయంలో కంపెనీలు, కస్టమర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దేశీయ సెల్‌ఫోన్ సంస్థలు పీసీబీ, ఎల్‌సీడీ, చిప్‌సెట్లను కొరియా, తైవాన్ నుంచి, మెమరీ కార్డులు జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.

చైనా కంటే ఇక్కడే తయారీ వ్యయం

చార్జర్లు, బ్యాటరీలు, హెడ్‌సెట్లు, బాక్స్‌ల వంటి మిగిలిన విడిభాగాలన్నీ భారత్‌లోనే తయారు చేయిస్తున్నట్టు గురు తెలిపారు. చైనా కంటే ఇక్కడే తయారీ వ్యయం తక్కువగా ఉందన్నారు. అన్ని విడిభాగాలు భారత్‌లోనే తయారు చేయాలన్న నిబంధన 2018 నాటికి ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉందన్నారు.

డిసెంబర్‌కల్లా మరో రెండు 4జీ ఫోన్లు

కంపెనీ డిసెంబర్‌కల్లా మరో రెండు 4జీ, రెండు 3జీ స్మార్ట్‌ఫోన్లను సెల్‌కాన్ ప్రవేశపెడుతోంది. అధిక మెగా పిక్సెల్‌తోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌తో రూ.7 వేలలోపు ధరల శ్రేణిలో మోడళ్లను తీసుకొస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hyderabad-based Celkon Mobiles launched two 4G phones under the Rs. 5,000 price category
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot